భారతీయ చలన చిత్ర రంగంలో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’, ‘బాహుబలి2’ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.  తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారత దేశంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.  బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత ఆ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న ‘రోబో’ 2.0 అని చెప్పొచ్చు.  బాహుబలి తర్వాత అంత బడ్జెట్ లో జానపద చిత్రాలు ఏవి తెరపైకి రాలేదు.
Image result for Sangamithra movie
కాగా, తమిళ సీనియర్‌ దర్శకుడు సుందర్‌.సి  తమిళ‌,తెలుగు, మ‌ల‌యాళ భాష‌లో  ఓ భారీ బడ్జెట్ చిత్రం తీస్తున్నారని..ఆ చిత్రం పేరు సంఘ మిత్ర‌ అని ఆ మద్య వార్తలు వచ్చాయి..కానీ దానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్స్ తర్వాత రాలేదు.  ఈ చిత్రంలో మొదట శృతి హాసన్ ని తీసుకుంటున్నామని..దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇందులో శృతిహాసన్ లేదని ప్రకటించారు. 
Image result for Sangamithra movie
తాజాగా తమిళ సీనియర్‌ దర్శకుడు సుందర్‌.సి ‘సంఘ మిత్ర‌’ చిత్రం తీసేందుకు మళ్లీ రెడీ అయ్యారట. అంతే కాదు ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జులై నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం రామోజీ స్టూడియోలో భారీ సెట్స్ ను వేస్తున్నారు.. తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో రూపొందే ఈ మూవీలో ఆర్య, జయం రవి హీరోలుగా న‌టిస్తున్నారు.. దిశా పఠాని కథానాయిక.  దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్టుతో నిర్మించేందుకు రెడీ అవుతున్నారట. 
Image result for Sangamithra movie
అయితే మూవీ ప్రారంభ‌కాక‌ముందే శృతితో వివాదం త‌లెత్త‌డంతో ఆమెను త‌ప్పించి దిశా ప‌టానీని తీసుకున్నారు.  శ్రీ తేండాల్‌ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిచనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ అప్‌డేట్స్‌కు సంబంధించి చిత్రయూనిట్‌ ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: