మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చి 2007లో చిరుతతో తెరంగేట్రం చేశాడు రాం చరణ్. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టగానే అతన్ని మెగా పవర్ స్టార్ అనేశారు. అయితే నటుడిగా తండ్రి లాగా మనసులను కదిలించే అభినయం మాత్రం చేయలేదని చెప్పాలి.


చరణ్ సినిమాలు కమర్షియల్ గా హిట్ అవుతున్నా ఇది రాం చరణ్ మాత్రమే చేయగలడు అన్న సినిమా ఏది లేదు. ఆ టైంలోనే వచ్చింది రంగస్థలం. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో చిట్టిబాబుగా చరణ్ నట విశ్వరూపం చూపించాడు. సినిమాలో ప్రతి ఫ్రేం ను అద్భుతంగా అందంగా తెరకెక్కించారు.


అందుకే సినిమా వసూళ్ల హంగామా సృష్టిస్తుంది. ఇక 2 రోజులకే 50 కోట్ల క్లబ్ లోకి చేరిన రంగస్థలం నాలురో రోజు పూర్తయ్యిందో లేదో 100 కోట్లు క్రాస్ చేసింది. యూఎస్ లో 2 మిలియన్ క్రాస్ చేసి రంగస్థలం వరల్డ్ వైడ్ గా సోమవారం కలెక్షన్స్ తో కలుపుకుని 102 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది.


ఇక నిన్న జరిగిన థ్యాంక్స్ మీట్ లో నిర్మాతలు ఈ విషయాన్ని అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. మెగా హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150 సినిమా తర్వాత 100 కోట్లు దాటిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. డీజే 100 కోట్ల పోస్టర్ వచ్చింది కాని అఫిషియల్ గా ఎంతన్నది తెలియలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: