విద్యాబాలన్.. పాపం ఎన్ని నటన ప్రధానమైన పాత్రలు చేసినా రాని పేరు ఒక్క డర్టీ పిక్చర్ తో వచ్చేసింది. ఆ సినిమా ఆమె కెరీర్ ను ఎలాంటి మలుపు తిప్పిందో అందరికీ తెలిసిందే. అయితే అలాంటి హాట్ భామ ఇంతవరకూ తెలుగులో సినిమా చేయలేదు. బాలీవుడ్ లో ఒక మెరుపు మెరిస్తే ఏదోలా తెలుగు తెరకు తీసుకొచ్చే నిర్మాతల చూపు మాత్రం ఇప్పటి వరకూ విద్యాబాలన్ పై పడలేదు. 

Image result for basavatarakam

తాజాగా నందమూరి నట సింహం బాలయ్య ఆ పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్ ను నటింపజేయాలని 
భావిస్తున్నారట. ఈ సినిమాలో కీలక పాత్ర అయిన ఎన్టీఆర్ భార్య పాత్ర బసవతారకం కోసం విద్యాబాలన్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది.

Image result for vidya balan hot

ఐతే.. ఈ స్టోరీ విన్న విద్యాబాలన్ తన పాత్రకు కొన్ని మార్పులు చేయాలని అడిగిందట. బాలయ్యే కండీషన్లు పెట్టడంతో మొదట్లో కాస్త కంగుతిన్నా.. ఆమె ఉంటే పిక్చర్ రేంజ్ మరికాస్త పెరుగుతుంది కాబట్టి కాస్త ఆలోచించారట.

Related image


అందులోనూ విద్యాబాలన్ చెప్పిన మార్పులు కూడా పెద్ద అభ్యంతరకరమైనవేవీకావట. దాంతో సరే అలాగే కానిద్దామన్నారట బాలయ్య. ఐతే.. సూత్రప్రాయంగా విద్యాబాలన్ ఓకే చెప్పినా.. ఇంకా కన్ ఫామ్ మాత్రం చేయలేదట. అదీ సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: