ఈ సమ్మర్ రేస్ కు రాబోతున్న ‘నాపేరు సూర్య’ కు ఊహించని సమస్యలు ఏర్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమాను మే 4వ తారీఖున విడుదల చేస్తారు అని భావించారు. ఈ రిలీజ్ డేట్ కు తగ్గట్టుగానే ఈమూవీ షూటింగ్ అంతా పూర్తి అయింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి సంబంధించి ఒక పాట చిత్రీకరణ మాత్రమే పెండింగ్ అని అంటున్నారు. ఈమధ్యనే అల్లు అర్జున్ ఈసినిమాకు సంబంధించిన మరొక పాట మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం అమెరికా వెళ్లి వచ్చాడు. 
NAAPERU  SURYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో అనుకున్న విధంగా ఈమూవీ మే మొదటి వారంలో విడుదల అవుతుంది అని భావిస్తున్న బన్నీ అభిమానులకు ఇప్పుడు షాకింగ్ లీకులు అందుతున్నాయి. ఇప్పటికే ఈమూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతూ ఉన్నా బన్నీ తన సినిమాను మే 4న విడుదల చేయడానికి ఇష్టపడటం లేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనికి కారణం ఈమూవీకి సంబంధించి అల్లు అర్జున్ ప్లాన్ చేసుకున్న మరో రెండు వారాల రీ షూట్ ప్లాన్ అని అంటున్నారు. 
NAAPERU  SURYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
సాధారణంగా అల్లు అర్జున్ తన సినిమాలకు సంబంధించి ఫైనల్ ఎడిటింగ్ లో విపరీతంగా జోక్యం చేసుకుంటాడు అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు ఈమూవీకి సంబంధించిన టోటల్ రష్ చూసిన తరువాత బన్నీ ఏ ఏ సన్నివేశాలు తిరిగి రీషూట్ చేయాలో వక్కంతం వంశీకి సూచించాడట. త్వరలోనే ఈ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. దీనితో ఈ ఆలస్యానికి తన అభిమానులు అసహానికి గురి కాకుండా బన్నీ ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించి మాస్టర్ ప్లాన్ వేసినట్లు టాక్. 
NAAPERU  SURYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమూవీ ఆడియో రిలీజ్ ను అత్యంత ఘనంగా ఈనెల మూడవ వారంలో నిర్వహించి ఈమూవీ పై క్రేజ్ తగ్గకుండా ఈ సినిమా విడుదలకు కేవలం నాలుగురోజులు ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించే విధంగా తన మూవీకి రెండు భారీ ఫంక్షన్స్ ను ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈవార్తల ప్రకారం ‘నా పేరు సూర్య’ విడుదల మే మూడవ వారానికి జరుగుతుంది అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే మే నెలలో రావలసిన చాల సినిమాల విడుదల గందరగోళంలో పడటం ఖాయం అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: