బాలీవుడ్ లో డైరెక్టర్స్ చూపంతా ఇప్పుడు హిస్టరీపై పడింది. ఇప్పటికే అమీర్ ఖాన్ మహాభారతాన్ని తెరకెక్కించడానికి రెడీ అయితే ... అక్షయ్ కూమార్ బయోపిక్స్ తో కిక్ ఇస్తున్నాడు. అయితే వీళ్లందరికి షాక్ ఇస్తూ రామాయణాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు ప్రభుదేవా. 500 కోట్లను కూడా ఖర్చు చేయడానికి వెనకడుగు వేయడం లేదు. ఇంతకీ సడన్ గా ప్రభుదేవా ఈ స్టోరీపై ఫోకస్ పెంచడానికి రీజన్ ఏంటి?

Image result for prabhu deva

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ... ఇండస్ట్రీ ఏదైనా హిస్టారికల్ మూవీస్ ని తెరకెక్కించడానికి సై అంటున్నారు డైరెక్టర్స్. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరడానికి రెడీ అవుతున్నాడు ప్రభుదేవా. 500 కోట్ల భారీ బడ్జెట్ తో  రామాయణాన్ని సినిమాగా తీయాలనేది తన కల అంటూ అసలు విషయన్ని వెల్లడించాడు ప్రభుదేవా. ప్రజెంట్ ఈ మ్యాటరే బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

Image result for prabhu deva

రామాయణాన్ని ఓ అద్భుత దృశ్యకావ్వంగా తీయాలంటే కనీసం 500 కోట్ల నుంచి 600 కోట్ల దాకా బడ్జెట్ అవుతుందని చెప్పుకొచ్చాడు ప్రభుదేవా. ఎప్పటికైనా ఆ బడ్జెట్లో రామాయణం తీయడానికి తను ఫిక్స్ అయినట్టు చెప్పుకొచ్చాడు. ఐతే ప్రజెంట్ భారతీయ చిత్రాల బడ్జెట్ ఆ స్థాయిలో లేదని.. ఐదేళ్ల తర్వాత ఆ స్థాయికి చేరొచ్చని చెప్పాడు. అందుకే ముందుగా స్టోరీ రెడీ చేసుకుంటే సినిమాని ఎప్పటికైనా పట్టలెక్కించొచ్చు అనే ఆలోచనలో ఉన్నాడట ఈ డ్యాన్ మాస్టర్.

Image result for prabhu deva

దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చి నటుడిగా వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రభుదేవా. రీసెంట్ గా ‘గుళేబకావళి కథ’ తో సందడి చేసిన ప్రభుదేవా.. త్వరలో ‘మెర్క్యురీ’ అనే మల్టీ లాంగ్వేజ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా అయ్యాక ప్రభుదేవా హిందీలో సల్మాన్ హీరోగా దబాంగ్-3 తీయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తూనే మరోవైపు రామాయణానికి సంబంధించి స్టోరిని రెడీ చేయిస్తాడట. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి సెట్స్ పైకి వెళ్లుతుందో... అసలు వెళ్తుందో లేదో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: