సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వడంతో సెన్సార్ కూడా కానిచ్చేసింది ఆ సినిమా యూనిట్. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయ్. సమ్మర్ వార్ లో రజనీ సందడి షురూ అవ్వడం కన్ఫామ్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఇంతకీ ఈ సినిమా రిజల్ట్ తో ఎవరి భవిష్యత్ ఎలా మారబోతుంది?

Image result for kala rajini

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఏది చేసినా స్పెషలే. నడిచినా, నవ్వినా, అది ఒక ట్రెండే. రజనీ చిత్రం వస్తోంది.. అంటే చాలు ఆ రోజు సెలవు పెట్టి మరీ సినిమా చూసే ఆడియన్స్ చాలామందే ఉన్నారు. గతంలో వచ్చిన కబాలి విడుదల సందర్భంగా చాలా ప్రైవేట్‌ సంస్థలు సెలవు దినంగా ప్రకటించాయి కూడా. కానీ కబాలి ఆశించినంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయినా ఆ సినిమా డైరెక్టర్‌ పనితనం నచ్చి అదే డైరెక్టర్‌కు మళ్లీ అవకాశం ఇచ్చాడు రజనీ. ప్రజెంట్ ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కిన కాలా మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది.

Image result for kala rajini

ప్రజంట్ కోలివుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రజనీ కాలా మూవీ రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. నిరవధిక సమ్మె ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సూపర్‌ స్టార్‌ అభిమానులను ఖుషీ చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది. కాలా సెన్సార్‌ కార్యక్రమాలు ముగిశాయనీ, సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ వచ్చిందని.. వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. సెన్సార్‌ సభ్యులు దాదాపు 10 మార్పులు సూచించి.. కొన్ని సన్నివేశాలను తీసేశారని సమాచారం.

Image result for robo 2

మొత్తానికి రజనీ సినిమా ఈ నెలలో వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తవ్వడంతో సమ్మె స్టాప్ అవ్వగానే ఈ మూవీ థియేటర్స్ లో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ సినిమా రిజల్ట్ పైనే శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన రోబో-2 సినిమా బిజినెస్ అధారపడి ఉంది. మరి ఈ సినిమా ఆడియాన్స్ కి ఎంత వరకు కనెక్ట్ అవుతుందో.. శంకర్ సినిమాకి ఎలాంటి బూస్టప్ ఇస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: