తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహరాజ రవితేజ రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఇదే ఊపు తో టచ్ చేసి చూడు చిత్రంతో వచ్చినప్పటికీ అది పెద్దగా విజయం సాధించలేదు.  ప్రస్తుతం ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో రవితేజ “నేల టిక్కెట్టు” చిత్రంలో నటిస్తున్నాడు.

క్లాస్ మాస్ అంశాల మేళవింపుతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న“నేల టిక్కెట్టు” సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణ నృత్య దర్శకుడు రాజ సుందరం నేతృత్వంలో గండిపేటలోని భారతదేశ మొట్టమొదటి స్కైజోన్ ట్రాంపోలిన్ పార్కులో మూడు రోజులుగా జరుగుతుంది.
Image result for nela ticket
షూటింగ్ వేగంగా పూర్తి చేసి మే 24న విడుదలకు సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు.  రాజాది గ్రేట్ తరహా ఈ నేట టిక్కెట్టు కూడా మంచి హిట్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. 

Image result for nela ticket

రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: