టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలతో పండగ చేసుకుంటున్న బ్యూటీ నయనతార. ప్రజెంట్ సెలెక్టడ్ మూవీస్ నే చేస్తున్న.. ఆ లిస్ట్ రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రజెంట్ చిరు సైరా మూవీలో నటిస్తున్న నయన్.. మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంతకీ ఏజ్ బార్ స్టేజ్ లో కూడా ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టడానికి రీజన్ ఏంటి?

Image result for nayanatara

తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలతో పాటు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి ట్రెండ్ సెట్ చేస్తున్న బ్యూటి నయనతార. ఈ పాత్రకు నయనతార అయితే మాత్రమే న్యాయం చేయగలదు అనేంతగా మెప్పిస్తోంది. రీసెంట్ గా ఆమె తమిళంలో చేసిన ‘అరం’ సినిమాకు ఓ రేంజిలో ప్రశంసలు వచ్చాయి. నయనతార ఇందులో ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని డ్యూటీకి న్యాయం చేసే కలెక్టర్ గా కనిపించింది.

Image result for nayanatara

‘అరం’ సినిమా తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదలైంది. జనజీవితాన్ని ప్రభావితం చేసే అంశంతో ఈ సినిమా వచ్చినా కేవలం నయనతారకున్న ఇమేజ్ వల్లే ఈ మూవీకి తమిళంతోపాటు తెలుగులోనూ మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో అరం సినిమాకు సీక్వెల్ తీయడానికి ఫిలిం మేకర్లు రెడీ అయిపోయారు. కర్తవ్యం సినిమా అంతా మారుమూల పల్లెలో నీటి సమస్య చుట్టూ తిరుగుతుంది. రెండో పార్ట్ పల్లెల్లో ఈనాటికీ ఉన్న కులవివక్ష ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

Image result for nayanatara

ఇలా ఒకవైపు సీక్వెల్ లో నటిస్తునే చిరు ‘సైరా’ మూవీలో కలరింగ్ తో కవ్వించనుంది నయన్. మరోవైపు హిందీలో హిట్ అయిన ‘పరి’ మూవీ తమిళ్ రీమేక్ లోనూ ఈ బ్యూటి సందడి చేయబోతుంది. ఇంతకీ ఏజ్ బార్ స్టేజ్ లోనూ నయన్ కి వరుస ఆఫర్స్ రావడానికి రీజన్ తన పెర్ఫామెన్స్.. తన కటౌట్ లో ఉన్న ఈజ్ తగ్గకపోవడమే కారణం అంటున్నారు. మరి ఈ సినిమాలు ఫినిష్ అయ్యేలోపు ఇంకెన్ని సినిమాలు నయన్ అకౌంట్ లో పడతాయో చూడాలి మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: