Image result for Dil raju received BN Reddy Memorial Award
తెలుగు చిత్ర సీమకు ఆధ్యుడు ఆరాధ్యుడు మరియు ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ "విజయా ప్రొడక్షన్స్" వ్యవస్థాపకులు, విజయ వాహినీ స్టూడియోస్  వ్యవ స్థాపకులు  యశస్వి శ్రీ బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (బి.ఎన్.రెడ్డి) గారి సంస్మరణార్ధం ఏటా నిర్వహించే "నాగిరెడ్డి స్మారక పురస్కారం" ప్రదానోత్సవం ఈ సంవత్సరం దుబాయ్‌ లో ఇండియన్ కాన్సొలేట్ ఆడిటోరియంలో జరిగింది. బిఎన్ రెడ్డి ని  "డోయన్ ఆఫ్ తెలుగు సినిమా పరిశ్రమ" గా చెప్పవచ్చు. ఈ రంగానికి ఆయన అందించిన సేవలు చిర స్మరణీయం. సరైన పాళ్ళలో కళత్మక విలువలు వ్యాపార ప్రయోజనాలు సాధించిన దర్శక దిగ్గజం. 
Image result for BN Reddy memorial Best cinema award to Fida Telugu movie
నటీనటులకు సరైన భావప్రకటనను దానికి తగిన స్వర మంద్రం (వాయిస్ మాడ్యులేషన్) రసాత్మకతను జోడించి మాట్లాడటం నేర్పటమే కాకుండా  గ్లిజరిన్ లేకుండా నటీనటులకు కన్నెరు తెప్పించిన వైషిష్ట్యం సాధించిన దర్శక సార్వభౌముడు ఇతడు. చిత్ర సీమ ఈయన్ని గౌరవంగా బి.ఎన్.రెడ్డి అని పిల్చుకుంటుంది.  
Image result for BN Reddy memorial Best cinema award to Fida Telugu movie  
అలాంటి అత్యుత్తమ దర్శకుని ఙ్జాపకార్ధం ఆయన కుటుంబ సభ్యులు నెలకొల్పిన "ఉత్తమ చిత్రానికి పురస్కారం" అంటే "బి. నాగిరెడ్డి స్మారక పురస్కారం" ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడో సంవత్సరంలో అడుగుపెట్టింది. విదేశీగడ్డపై తొలిసారిగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇకపై పలు విదేశాలలో జరుపుతామని విజయా ప్రొడక్షన్స్ అధినేతలు వెల్లడించారు.
pathala-bhairavi 
ఈ సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా "ఫిదా"ను గుర్తించి, ఆ చిత్ర నిర్మాతయైన దిల్ రాజు కి ఈ "బి ఎన్ రెడ్డి స్మారక పురస్కారం" అందజేశారు. పురస్కార బహుమతిగా జ్ఞాపికతో పాటు ఒకటిన్నర లక్షలరూపాయల నగదును ఆ చిత్ర నిర్మాత దిల్ రాజుకు అందజేశారు.
missamma 
దుబాయ్‌లో ఉన్న "వేవ్స్ రిసొనెన్స్‌" కు చెందిన శ్రీమతి గీతా రమేశ్ మరియు శ్రీ రమేశ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని స్వర్గీయ బి.ఎన్.రెడ్డి గారి కుమారులు బొమ్మిరెడ్డి వేంకటరామిరెడ్డి, కోడలు మరియూ విజయా ఆసుపత్రుల అధినేత్రి శ్రీమతి భారతి రెడ్డి పర్యవేక్షించారు. శ్రీమతి సుధ పల్లెం ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 
2-maya-bazaar
ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ మాధవపెద్ది సురేష్ గారి వాద్య, గాయక బృందం విజయా వారి పాటలతో, స్థానిక 'నట్టువాంగనలు' తమ సాంప్రదాయక నాట్యంతో ఆహుతులను అలరించగా, భారత దౌత్యవేత్త శ్రీమతి సుమతీ వాసుదేవన్ ఈ కార్యక్రమాన్ని "జ్యోతి ప్రజ్వలన" చేసి ప్రారంభించారు. 

Image result for madhavapeddi sureshఈ సందర్భంగా బి.ఎన్. రెడ్డి గారి విజయ విశేషాలను మాధవపెద్ది సురేశ్, శ్రీమతి భారతీ రెడ్డి మొదలగువారు కొనియాడారు. అనంతరం అబుదాబీకి చెందిన ఆదిభట్ల కామేశ్వర శర్మ మాట్లాడుతూ, విజయా సంస్థ ఒక ప్రామాణిక సంస్థ అనీ, ఆ సంస్థ వ్యవస్థాపకులు మానవాతీత ప్రజ్ఞాశాలురనీ, వారి యశస్సు ఆచంద్రతారార్కం వర్దిల్లనుందని కొనియాడారు.

Image result for chandamama vijaya combines

శ్రీమతి సునీతా లక్ష్మినారాయణ, వేవ్స్ రెసోనెన్స్ సంస్థ సంక్షేమ కార్యదర్శి శ్రీమతి ఉమా పద్మనాభం, స్వప్నికా శ్రీనివాస్, విశాల మధుల సమక్షంలో బి.ఎన్ రెడ్డి స్మారక పురస్కారం అందుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ఇటువంటి పురస్కారం అందుకోవడం తన అదృష్టం అని, జీవితం సాఫల్యత పొందిన భావన కలుగిందని చెప్పారు. ఇంతటి సాంప్రదాయకతను చరిత్రను తనలో ఇముడ్చుకున్న ఈ పురస్కారం అందుకోవటానికి దుబాయే కాదు ప్రపంచంలో ఏమూలకైనా వెళతానని అన్నారు.

Image result for Dil raju received BN Reddy Memorial Award

మరింత సమాచారం తెలుసుకోండి: