కంగన రనౌత్.. పేరొక్కటి చాలు ఆమె టాలెంట్ ఏంటో తెలుసుకోవడానికి.! బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది కంగన. ఆమె నటించిన చిత్రాలన్నీ ప్రయోగాలే. అవే ఆమెకు విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చాయి. తాజాగా ఆమె నటిస్తున్న సినిమా మణికర్ణిక. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకు దర్శకుడు.

Image result for kangana ranaut manikarnika

గౌతమి పుత్ర శాతకర్ణి ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్న క్రిష్.. మణికర్ణిక సినిమాకోసం తీవ్రంగానే కసరత్తు చేశాడు. బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. కంగనను ఈ సినిమాకు లీడ్ రోల్ లో తీసుకోవడం ద్వారా సగం సక్సెస్ అయ్యాడనే పేరు తెచ్చుకున్నాడు. కథను పక్కాగా సిద్ధం చేసుకోవడం క్రిష్ స్టైల్. అందుకు తగ్గట్టే క్రూను కూడా తీసుకుంటాడు. ఇప్పుడీ సినిమా శరవేగంగా కంప్లీట్ అవుతోంది. త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. .

Image result for kangana ranaut manikarnika

బయోపిక్ లు అంటేనే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఝాన్సీ లక్ష్మిబాయి కథతో రూపొందుతున్న ఈ సినిమాపై కూడా కొంతమంది కక్షగట్టారు. ఈ సినిమా కథను వక్రీకరించారంటూ సర్వ బ్రాహ్మణ మహాసభ ప్రతినిధులు ఆరోపించారు. దీనిపై సినిమా యూనిట్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇది చారిత్రక చిత్రమని, వక్రీకరించాల్సిన అవసరం ఏముందని కంగన ప్రశ్నించింది. తామేమీ లవ్ స్టోరీ తీయట్లేదని తేల్చి చెప్పింది. ఈ సినిమా కోసం కత్తి యుద్ధాలు నేర్చుకున్న కంగన.. ఈ సినిమాపై విమర్శలు చేసే వారిపై కత్తి దూస్తోంది. అలా ఆ కత్తి యుద్ధాలు పనికొస్తున్నాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: