తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య బయోపిక్ చిత్రాలు బాగానే ప్లాన్ చేస్తున్నారు.  ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి అందాల తార..మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  మహానటులు..విశ్వవిఖ్యాత నటసార్వభౌములు ఎన్టీఆర్ జీవిత ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించగా ముహూర్తం కూడా మొదలు పెట్టారు. 
Image result for మహానటి
అయితే సినీ తారలపై బయోపిక్ లు వస్తున్న నేపథ్యంలో తెలుగు లో మొదటి సారిగా రాజకీయ నాయకుడిపై కూడా ఓ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మహానేతగా పేరు తెచ్చుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తీయబోతున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన  లోగో కూడా బయటకు వచ్చింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు సుదీర్ఘపాదయాత్రే బయోపిక్ లో కీలకంగా వుంటుంది.
Image result for NTR BIOPIC
అందుకే టైటిల్ యాత్ర అని పెట్టారు. అందుకు తగినట్లే పాదం చిత్రంలో యాత్ర అనే అక్షరాలు ఫిక్స్ చేసి వదిలారు. లోగో చాలా ఆర్టిస్టిక్ గా వుంది. ఈ టైటిల్ లుక్ తో పాటు క్యాప్షన్ కూడా ఆసక్తిదాయకంగా ఉంది.‘కడప దాటి ప్రతీ గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది..మీ గుండెచప్పుడు వినాలనుంది..’ అనే క్యాప్షన్ తో టైటిల్ లోగోను విడుదల చేశారు.
Image result for mammoottY
‘హీ వాంటెడ్ టు లీవ్ ఏ ఫుట్ ప్రింట్ ఇన్ హిస్టరీ, ఇన్ స్టెడ్ హీ లెఫ్ట్ వన్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ పీపుల్’ అనే ఇంగ్లిష్ క్యాప్షన్ ను కూడా యాడ్ చేశారు. అంతే కాదు  డిజైన్ టోన్ కూడా బాగుంది. ఏప్రియల్ 9న షూటింగ్ ప్రారంభిస్తున్న ఈ సినిమా లోగో వదిలారు.మమ్ముట్టి వైఎస్ఆర్ గా, శరణ్య విజయమ్మగా, సూర్య వైఎస్ జగన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లోపే రెడీ అయిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: