అవును మీరు విన్నది నిజం..భారతీయ చలన చిత్ర రంగంలో పెను సంచలనాలు సృష్టించాయి బాహబలి, బాహుబలి 2 చిత్రాలు.  ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు ప్రపంచ స్థాయిలో రికార్డులు సృస్టించాయి.   అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా బాహుబలి 2 నిలిచింది. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న రికార్డులు మొత్తం తుడిచిపెట్టుకు పోయాయి. 

తాజాగా బాహుబలి1 కలెక్షన్ రికార్డు బ్రేక్ చేసింది..మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం.  గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన రంగస్థలం చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది.  తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి.ముఖ్యంగా ఓవర్‌ సీస్‌లో 28 లక్షల డాలర్లకు పైగా వసూళు చేసిన ఈ సినిమా 30 లక్షల డాలర్ల మార్క్‌ను కూడా ఈజీగా సాధిస్తుందని భావిస్తున్నారు. 
Image result for rangasthalam movie
తాజాగా రంగస్థలం ఓ రికార్డు తన ఖాతాలో వేసుకుంది.  తొలి వారాంతంలో 80 కోట్లకు పైగా షేర్‌ వసూళు చేసి బాహుబలి 1 తరువాతి స్థానంలో ‘రంగస్థలం’ నిలిచింది.  అయితే తమిళనాట మాత్రం తమిళనాట మాత్రం బాహుబలి 1 రికార్డ్‌ లను దాటేసింది.సమ్మె కారణంగా కోలీవుడ్‌ లో తమిళ చిత్రాలేవి విడుదల కాకపోవటం రంగస్థలంకు కలిసొచ్చింది. 
Related image
తొలి ఎనిమిది రోజులకు చెన్నై నగరంలోనే కోటి రూపాయల షేర్‌ వసూళు చేసి సత్తా చాటింది రంగస్థలం.  సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో రాంచరణ్, సమంత, జగపతిబాబు, ఆది పినిశెట్టి, యాంకర్ అనసూయ ముఖ్య పాత్రల్లో నటించారు.  మొదటి నుంచి ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరుగుతూ వచ్చాయి..ఆడియో కూడా సూపర్ హిట్ అయ్యింది.  రంగస్థలం ముందు ముందు మరిన్ని రికార్డులు సాధిస్తుందని మెగా అభిమానులు తెగ సంతోషంలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: