శ్రీరెడ్డి ఇప్పుడు సూపర్ పాపులర్. నిన్నటివరకూ లీకులిస్తా.. లీకులిస్తా.. అంటూ తిరిగిన శ్రీరెడ్డి నిన్న మాత్రం బట్టలిప్పి రోడ్డుపైకి వచ్చేసింది. న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈరోజు మాత్రం మరో లీక్ తో ముందుకొచ్చింది. వైవాతో సూపర్ పాపులర్ అయన హర్షతో చేసిన చాట్ ను బట్టబయలు చేసింది. దీంతో ఎప్పుడు ఎవరిపై శ్రీరెడ్డి కన్ను పడ్తుందోననే భయం ఇండస్ట్రీలో మొదలైంది.


వైవాతో సూపర్ పాపులర్ అయిన నటుడు, కమెడియన్ హర్ష. ఇప్పుడు శ్రీరెడ్డి.. హర్షను టార్గెట్ చేసింది. గతంలో హర్ష తనతో చేసిన వాట్సాప్ చాట్ ను బయటపెట్టింది. షార్ట్ ఫిల్ములు, యూట్యూబ్ ఛానళ్లలో అవకాశాలు ఇవ్వాలని హర్షను కోరితే.. తనతో ఎలా బిహేవ్ చేశాడో చూడండి.. అంటూ వాట్సాప్ చాట్ ను స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.


అంతేకాదు.. తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపనని తేల్చిచెప్పింది. అవసరమైతే ఈ విషయాన్ని నేషనల్ మీడియాకు తీసుకెళ్తానని హెచ్చరించింది. తెలుగు వారికి న్యాయం చేయాలనే తన డిమాండ్ లో ఎలాంటి మార్పూ లేదన్నారు. తెలుగు అమ్మాయిలకు సినిమాల్లో 75 శాతం అవకాశాలివ్వాలనేది శ్రీరెడ్డి ప్రధాన డిమాండ్. కాస్టింగ్ కౌచ్ కు తెలుగు అమ్మాయిలు అంగీకరించకపోవడం వల్లే ఇక్కడి వాళ్లకు అవకాశాలిచ్చేందుకు టాలీవుడ్ పెద్దలు అంగీకరించడం లేదన్నారు. దీనిపై తన ఉద్యమం కొనసాగుతుందన్నారు.


          అయితే మా మాత్రం శ్రీరెడ్డి తీరుపై విరుచుకుపడింది. ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేసే పరిస్థితే లేదని తేల్చి చెప్పింది. బట్టలిప్పినంత మాత్రాన అవకాశాలు రావని, ప్రతిభతో దక్కించుకోవాలని సూచించారు. శ్రీరెడ్డి లాంటి వాళ్ల బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు మా సభ్యులు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: