చెప్పుకో తగ్గ అద్భుత నటి కాకపోయినా కాజల్ ఇప్పటివరకు 50 సినిమాలలో నటించడం వెనుక ఆమె సమర్ధత కంటే ఆమె అదృష్టం ఆమెకు అన్ని విధాలా కలిసి వచ్చింది అన్న కామెంట్స్ ఉన్నాయి. టాప్ హీరోలు అందరితోను నటించిన ఈమె మెగా హీరోలు అందరిని ఇంచుమించు ఒక చుట్టుచుట్టేసింది. ఏవిషయం పై అయినా స్పష్టంగా ఓపన్ గా మాట్లాడే కాజల్ తాను మీడియా సంస్థలకు ఇచ్చే ఇంటర్వ్యూలలో కూడ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. 
kajal latest photoshoot 2018 కోసం చిత్ర ఫలితం
ఆమె తరుచు అనేక మీడియా సంస్థలకు ఇచ్చే ఇంటర్వ్యూలలో హీరోలకు మార్కులు వేయడమే కాకుండా హీరోల్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను ఓపెన్ గా చెప్పడం కాజల్ స్టైల్.  ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో ఈబ్యూటీ ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ టాప్ హీరోల పై కామెంట్స్ చేసింది. తన దృష్టిలో మోస్ట్ రొమాంటిక్ హీరో అంటే చిరంజీవి మాత్రమే అంటూ తన అభిప్రాయాన్ని బయట పెట్టింది. అంతేకాదు తాను  చాలామంది హీరోలతో వర్క్ చేసినా చిరంజీవి అంత రొమాంటిక్ గా తనకు ఇప్పటివరకు ఎవరు కనిపించలేదు అంటూ మెగా అభిమానులకు జోష్ ను ఇచ్చింది.  
kajal latest photoshoot 2018 కోసం చిత్ర ఫలితం
అయితే తాను ఇప్పటివరకు వర్క్ చేసిన హీరోల్లో సైలెంట్ పర్సన్ మహేష్ అని అంటూ మహేష్  మ్యాగ్జిమమ్ కామ్ గా ఉండడానికి ట్రై చేస్తాడు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇక ఇదే సందర్భంలో అల్లు అర్జున్ గురించి మాట్లుడుతూ ఫ్యాషన్స్ ఫాలో అవ్వడంలో అల్లు అర్జున్ ను మించిన వాడు లేడు అని చెపుతూ తాను ఎందరో హీరోలతో నటించినా మెగా స్టార్ లోని గ్రేస్ మరి ఏ హీరోలలోను చూడలేదు అంటూ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసింది కాజల్. 
kajal latest photoshoot 2018 కోసం చిత్ర ఫలితం
ఈ ఫిలిం ఇండస్ట్రీలో తాను ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న తనను ప్రేమలో పడేయాలని ఎవరూ ప్రయత్నించలేదన్న విషయం పై క్లారిటీ ఇస్తూ హీరో నవదీప్ మాత్రం 2-3 సార్లు తనను ప్రేమలో పడేయాలని ప్రయత్నించినా తాను తప్పించుకున్న విషయాలను బయటపెట్టింది. అయితే కాజల్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్ కల్పించిన ‘మగధీర’ సినిమాలో తనతో నటించిన చరణ్ గురించి ఏమి కామెంట్ చేయకపోవడం ఇక్కడి ట్విస్ట్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: