బండ్లు ఓడలవడం.. ఓడలు బండ్లవడం.. చాలా కామన్. ఎలాంటి వాళ్లకైనా టైమ్ బాగోలేకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో రకుల్ సిచ్యుయేషన్ కూడా అలాగే ఉంది. నిన్నటిదాకా ఫుల్ స్వింగ్ లో తనకు తిరుగులేదనిపించుకున్న రకుల్.. ఇప్పుడు దూరమైపోయింది. అయితే చాలా కాలం తర్వాత ఈ అమ్మడికి మళ్లీ ఆఫర్ వచ్చిందట. దీంతో పండగ చేస్కుంటోందీ భామ.

Image result for rakul preet singh

రకుల్ ప్రీత్ కు బ్యాడ్ టైం నడుస్తోంది. స్పైడర్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అదేమో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆ అమ్మడి రూట్ రివర్స్ అయింది. స్పైడర్ తర్వాత ఒక్క మూవీకి కూడా రకుల్ కమిట్ అవలేదు. తమిళ్ లో మాత్రమే చేస్తోంది. వాటి తర్వాత వాట్ నెక్స్ట్ అంటే అమ్మడి దగ్గరి ఆన్సర్ లేదు.

ఇంతలో వెతకబోయిన తీగ .. అన్నట్టు మంచి ఛాన్స్ ఇంటి ముంగిటకు వచ్చి వాలింది. వెంకీ  చైతు కాంబినేషన్ లో రాబోతున్న మూవీలో రకుల్ ప్రీత్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. డైరెక్టర్ ఇప్పటికే కథ వినిపించి రకుల్ తో ఓకే చేయించుకున్నట్టు టాక్. ఎన్టీఆర్ తో జై లవకుశ తీసిన బాబీ.. ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. 

Image result for rarandoi veduka chuddam

చైతూ, రకుల్ కాంబినేషన్ లో వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రకుల్ తో మరోసారి జోడీ కట్టబోతున్నాడు. అంతేకాదండోయ్.. రకుల్ ను స్వయంగా చైతూనే రెఫర్ చేశారట. మరి ఈ లక్కీ జోడీ ఈసారి ఎలాంటి హింట్ అవుతుందో వేచి చూద్దాం..!


మరింత సమాచారం తెలుసుకోండి: