తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ బ్యూటీస్ కి కాలం చెల్లింది. దీంతో కుర్ర కుట్టీలకు ఫుల్ ఛాన్స్ లు వస్తున్నాయి. నివేదా, సాయి పల్లవి, మేఘ లాంటి వాళ్లు ఇప్పటికే సందడి చేస్తున్నారు. వీళ్లతోపాటు వరుస ఆఫర్లతో దున్నేస్తోంది అనుపమ పరమేశ్వరన్.

Image result for anupama parameswaran

అనుపమా పరమేశ్వరన్... ప్రజంట్ టాలీవుడ్ లో పుల్ బిజీగా ఉన్న హీరోయిన్. మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమమ్ తో తన ట్యాలెంట్ ను చూపిన ఈ బ్యూటి.. తెలుగులో కూడా ఆ పాత్రను అంతే అందంగా చేసింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు అఆ చిత్రంతో అనుపమను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు త్రివిక్రమ్. అనుపమా లాంటి టాలెంటెడ్ బ్యూటీస్ ఇండస్ట్రీకి చాలా అవసరమని త్రివిక్రమ్ చెప్పిన మాటలు.. అనుపమ కెరీర్ పై బాగానే ప్రభావం చూపించాయి.

Related image

లాస్ట్ ఇయర్ తెలుగులో నాగచైతన్య.. శర్వానంద్ లాంటి హీరోలతో వరుస సినిమాలు చేసింది అనుపమ. గతేడాది ప్రారంభంలో శతమానం భవతి అంటూ బ్లాక్ బస్టర్ హిట్ ఎకౌంట్ లో వేసుకున్న ఆ ముద్దుగుమ్మ  తర్వాత ఉన్నది ఒకటే జిందగీ లో రామ్ సరసన మెరిసింది. కానీ రిజల్ట్ గాడి తప్పడంతో ఇయర్ మొత్తంలో  ఒక్క సినిమాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తోంది. ఈ వారంలో రిలీజ్ కాబోతోన్న నాని మూవీ కృష్ణార్జున యుద్ధంలో అనుపమ ఒక హీరోయిన్ గా కవ్వించనుంది.

Image result for anupama parameswaran

నానితో జోడీ కట్టిన అనుపమ.. ఆ తరువాత వరుణ్ తేజ్ తో కరుణాకరన్ తీస్తున్న మూవీలో ప్లేస్ సొంతం చేసుకుంది.. మరోవైపు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న హలో గురూ ప్రేమ కోసమేరా చిత్రంలో కూడా అనుపమే హీరోయిన్. ఇలా రెండు బడా ప్రాజెక్ట్స్ ని ఎకౌంట్ లో వేసుకున్న ఈ బ్యూటీ యంగ్ హీరోస్ సినిమాలను హోల్డ్ లో పెట్టింది. మొత్తానికి ఈ బ్యూటి చేయాల్సిన సినిమాల లిస్ట్ చాలానే ఉంది. దీంతో తన హోమ్ ఇండస్ట్రీ అయిన మలయాళంలో వరుస ఆఫర్స్ వస్తున్నా లైట్ తీసుకుంటోంది ఈ బ్యూటి. మొత్తానికి టాలీవుడ్ లో పాతుకుపోవాలనే ప్లాన్ లో ఉంది అనుపమ.


మరింత సమాచారం తెలుసుకోండి: