భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్లు గా ఒక్క వెలుగు వెలిగిపోయారు..రజినీకాంత్, కమల్ హాసన్.  స్టైలిష్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు తెచ్చుకుంటే..ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు.  ఒక్క భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వీరి చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. వీరి సినిమాలు విడుదలైతే తమిళనాడులోనే కాదు... రెండు తెలుగు రాష్ట్రాలు- కర్ణాటక- కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సందడి నెలకొంటుంది.  ప్రస్తుతం ఇద్దరూ సిని ఫీల్డ్ లో నుంచి పాలిటిక్స్ లోకి అడుగు పెడుతున్నారు. 
Image result for kaveri water proter tamil
ఇప్పటికే వీరిద్దరూ తమ పార్టీ పేర్లు కూడా ప్రకటించారు.  దీంతో ఇప్పుడు వారి సినిమాలకు గడ్డు కాలం వచ్చింది. అనవసర విషయాల్లో వేలుపెడుతున్న ఈ స్టార్ల సినిమాలను బ్యాన్ చేయాలని అనుకుంటోందట ఓ  దక్షిణాది రాష్ట్రం.  ప్రస్తుతం తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల్లో కావేరీ జలాల వివాదం నడుస్తుంది.  ఈ నేపథ్యంలో తమిళ నాట బందులు, రాస్తారోకోలు జరుగుతున్నాయి. అంతే కాదు మొన్నటి వరకు పార్లమెంట్ లో సైతం ఈ విషయంపై పెను దుమారం చెలరేగింది.  ఇక కావేరీ జలాల వివాదంపై కర్ణాటకకు వ్యతిరేకంగా సిని ఇండస్ట్రీ కూడా కదలి వచ్చింది.   
Image result for kaala movies
రజినీకాంత్ అయితే ఒకడుగు ముందుకేసి... ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీం సభ్యులు నల్ల బ్యాచ్ ధరించి నిరసన తెలపాలని కోరాడు. దీంతో వీరి సినిమాలను కర్ణాటకలో విడుదల కాకుండా నిషేధం విధించాలని భావిస్తున్నారు కన్నడ డిస్టిబ్యూటర్లు. వటల్ నాగరాజు అనే కన్నడ ఉద్యమనేత కమల్- రజినీ సినిమాలను కర్ణాటకలో విడుదల కాకుండా నిషేధం విధించాలని కన్నడ డిస్టిబ్యూటర్లకు పిలుపునిచ్చాడు.
Related image
ఆయన పిలుపుపై అక్కడి డిస్టిబ్యూటర్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టు సమాచారం.  అయితే ఈ ఎఫెక్ట్ రజినీ నటించిన ‘కాలా’, కమల్ నటించిన ‘విశ్వరూపం 2’ పై పడే అవకాశాలు ఉన్నాయి.  ఈ నిషేదంపై ఇద్దరు హీరోలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: