కన్నడ కుట్టి అయినా.. అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే హీరోయిన్ మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చురగొంది. చిన్న సినిమాల్లో నటించి హిట్ ట్రాక్‌ను సొంతం చేసుకుంది.మాధవీలత మొదట్లో చిన్న చిన్న పాత్రలో సినిమాల్లోకి అడుగుపెట్టి 2008లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నచ్చావులే (2008) సినిమాలో కథానాయికగా నటించింది. అంతే కాదు మాధవి లత మొదట మోడలింగ్ చేసి..తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది..ఈమె మంచి నర్తకి. 
రకుల్.. అబద్దం చెబుతున్నారు : మాధవీ లత
ఇక సినీ పరిశ్రమలో గత కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ అనే పదం బాగా వినబడుతూ వస్తుంది. ఈ అంశంపై పలువురు భామలు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వ‌ర‌కు లైంగిక వేధింపుల‌కు వ్య‌తిరేకంగా హీరోయిన్లంద‌రూ పోరాడుతూ త‌మ నిర‌స‌న‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. ఆ మద్య తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో "కాస్టింగ్ కౌచ్" అనేదే లేద‌ని, తనకు అలాంటి పరిస్థితి వేధింపులు ఎదుర్కోలేదని రకూల్ స్పష్టం చేసింది.
Image result for మాధవీ లత కాస్టింగ్ కౌచ్
దీనిపై స్పందించిన మాధవి లత కాస్టింగ్ కౌచ్ గురించి రకుల్ చెప్పింది అంతా అబద్దం అంటూ తెలుగు హీరోయిన్ మాధ‌వీ ల‌త స్పందించడం వైరల్ గా మారింది. తాజాగా మాధవీ లత తన ఫేస్ బుక్ ఖాతాలో పెడుతూ మహిళ ఒక వస్తువేనని చెప్పింది. ఈ విషయాన్ని పాతికేళ్ల క్రితమే విమలా అక్క తన రచనల్లో చెప్పిందని గుర్తు చేస్తూ, 'దిగంబరుల ఊరేగింపు' పేరిట విమల రాసిన ఓ కవితను పోస్టు చేసింది. ఇక్కడే కాదు ప్రతి చోట కాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ వెల్లడించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: