తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో నటించి మెప్పించిన హీరోయిన్ లిజి.  తెలుగు లో నటించింది తక్కువే అయినా..మంచి గుర్తింపు వచ్చిన చిత్రాలు కావడం విశేషం. రాజేంద్ర ప్రసాద్ తో సాక్షి, సుమన్ తో ఆత్మబంధం ఇలు పలు సినిమాల్లో నటించింది లిజి. తర్వాత మళియాళ దర్శకుడు ప్రియదర్శన్ ని వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ పలు మలయాళం, హిందీ సినిమాలతో పాటు గతంలో రెండు తెలుగు సినిమాలను కూడా డైరెక్ట్ చేశారు.
Image result for కల్యాణి ప్రియదర్శన్ ఫ్యామిలీ
లిజి,ప్రియదర్శన్ కూతురు కల్యాణి ప్రియదర్శన్ గతేడాది అమెరికాలో చదువు పూర్తి చేసుకొని ఇండియాకు వచ్చింది. తండ్రి డైరెక్టర్ కావడంతో ఆమె కూడా ఆయన ప్రోత్సాహంతో దర్శకత్వశాఖలో పని చేస్తోంది. విక్రమ్ నటించిన 'ఇంకొక్కడు' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసింది. తెలుగులో అక్కినేని కుర్రాడు అఖిల్ సరసన ‘హలో’ చిత్రంలో నటించింది. ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా, కల్యాణికి మాత్రం మంచి పేరే వచ్చింది.
Image result for కల్యాణి ప్రియదర్శన్ ఫ్యామిలీ
ఈ క్రమంలో ఈమె కొత్త అవకాశాల వేటలో ఉంది. ప్రస్తుతం తెలుగులోనే శర్వానంద్ సినిమాలో నటిస్తోంది కల్యాణి.  తాజాగా కళ్యాని పై పలు రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా మలయాళంలో మోహన్ లాల్ తనయుడు హీరోగా చేసే సినిమాలో లిజికి అవకాశం వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఐవీ శశి తనయుడి సినిమాలో కూడా కల్యాణికి అవకాశం వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.
Image result for కల్యాణి ప్రియదర్శన్ ఫ్యామిలీ
ఈ రూమర్లపై స్పందించిన కళ్యాణి ప్రియదర్శని మోహన్ లాల్ తనయుడి సినిమాలో కానీ, ఐవీ శశి తనయుడి సినిమాలో కానీ తను నటించడం లేదని.. అవి రూమర్లే అని స్పష్టం చేసింది.  ట్విస్టు ఏంటంటే..ఆ రూమర్లు నిజమైతే ఎంతో బాగుండో అని సరదాగా వ్యాఖ్యానించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: