అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో అద్భుతమైన సాంగ్ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. బ్యూటిఫుల్ లవ్ పేరుతో ఈ సాంగ్ అల్లు అర్జున్ మెలోడీ బీట్ లలో బెస్ట్ సాంగ్ లా నిలిచిపోతుందనిపించేలా ఉంది.

Image result for na peru surya

వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసుకుంటోంది. ఓ వైపు ఫైనల్ షెడ్యూల్ పూర్తవుతుండగానే.. మరోవైపు ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే నెల 4వ తేదీన సినిమా రిలీజ్ చేయాలని ఇప్పటికే సినిమా యూనిట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తోంది వక్కంతం టీం.

Image result for na peru surya

తాజాగా బ్యూటీ ఫుల్ లవ్ పేరుతో ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆర్యలో ఫీల్ మై లవ్ పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్యూటీ ఫుల్ లవ్ సాంగ్ కూడా మంచి మెలోడీ. స్లో బీట్ తో సాగిన ఈ సాంగ్ పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా వచ్చినట్లు సినిమా యూనిట్ చెప్తోంది. విశాల్ – శేఖర్ కంపోజ్ చేసిన ఈ పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కాబోతోందట. ఇప్పటికే రెండు పాటలను సినిమా యూనిట్ విడుదల చేసింది.

Related image

          దేశభక్తి నేపథ్యంలో వస్తున్న నా పేరు సూర్య సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెలాఖరుకు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చేనెల 4న సినిమా రిలీజ్ చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: