తెలుగు ఇండస్ట్రీలో వెంకటేష్, మహేష్ బాబులు నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమెల్లె చెట్టు’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  కుటుంబ విలువలు తెలియజేసిన ఈ చిత్రంలో మహేష్, వెంకటేష్ లు అన్నదమ్ములుగా నటించారు.  అయితే ఈ చిత్రంలో మరో అద్భుతమైన క్యారెక్టర్ లో నటించింది అంజలి.  అచ్చమైన తెలుగు అమ్మాయిగా..‘అదేంటో నాకు అన్నీ అలా తెలిసిపోతాయ్’ అంటూ అమాయకంగా చెప్పే డైలాగ్స్ కి తెగులు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 
Image result for anjali twitter
వాస్తవానికి అంజలి ‘షాపింగ్ మాల్’ కానీ ‘జర్నీ’ చిత్రంతో మంచి పేరు వచ్చింది.  ఈ చిత్రాల్లో చాలా సాంప్రదాయంగా నటించిన అంజలి తర్వాత మాళీవుడ్, కోలీవుడ్ లో గ్లామర్ పాత్రల్లో నటించింది.  అప్పుడప్ప ఐటమ్ సాంగ్స్ లో కూడా నటిస్తుంది.  ఆ మద్య బొద్దుగా తయారు కావడంతో ఈ అమ్మడికి మూవీ ఛాన్స్ లు తగ్గాయి. దీంతో తన ఫిజిక్ పై శ్రద్ద పెడుతూ..కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది.
Image result for anjali twitter
ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్‌కు సన్నద్ధం అవుతోంది అంజలి. ఇది వరకూ ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘గీతాంజలి’కి సీక్వెల్ వస్తుందని అంటున్నారు. అలాగే ‘గుంటూరు టాకీస్’ కు సీక్వెల్ పార్టులో కూడా అంజలి నటించే అవకాశాలున్నాయట. వీటన్నింటికీ మించి కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించే సినిమాలో అంజలికి ఒక ముఖ్య పాత్ర లభించనున్నదని సమాచారం. 
Related image
తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం నిర్వహించిన ఫొటో షూట్ లో అంజలి తన గ్లామరస్ లుక్స్ లో  పిచ్చెక్కించింది. హట్ లుక్స్‌లో అదరగొట్టేసింది. సీనియర్ హీరోల సరసన నటించడానికి తగిన నటిగా గుర్తింపు పొందిన అంజలికి ఈ ఫొటోలతో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: