నేషనల్ అవార్డ్స్ అంటే వాటిని చాలా మంది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎవరికైనా అవార్డ్స్ వస్తే వారిని జాతీయ స్థాయి నటులు అని ఆకాశానికి ఎత్తేస్తాము. కానీ జాతీయ అవార్డ్స్ మీద కూడా చాలా సార్లు విమర్శలు వచ్చినాయి. అసలు ఒక సినిమా కి అవార్డు వచ్చిందంటే ఎందుకు వచ్చిందో కూడా కొన్ని సార్లు అర్ధం కాదు. ఇప్పుడే కూడా ఇటువంటి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ సారి బాహుబలి 2 కి అవార్డు రాకపోవడం తో అసలు ఎందుకు రాలేదని చాలా మందికి అర్ధం కాలేదు. 

Image result for bahubali 2

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బాహుబలి-2ని జాతీయ ఉత్తమచిత్రంగా ప్రకటించలేదు! అలా ప్రకటించకపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు, కానీ బాహుబలి పార్ట్ వన్ ను జాతీయ ఉత్తమ చిత్రంగా ప్రకటించారు రెండేళ్ల కిందట. అసలు ఏ బేస్ మీద ఆ సినిమాను అప్పుడు జాతీయ ఉత్తమచిత్రంగా ప్రకటించారో ఎవరికీ తెలీదు.జాతీయ ఉత్తమ చిత్రాన్ని ఫీచర్ ఫిల్మ్ కేటగిరి నుంచినే తీసుకుంటారు. చిల్డ్రన్, నాన్ ఫిక్షన్, డాక్యుమెంటరీ.. కేటగిరి సినిమాలు ఉత్తమ చిత్రం కేటగిరిలోకి రావు. ఫీచర్ ఫిల్మ్ ను మాత్రమే ఉత్తమ చిత్రంగా ప్రకటిస్తారు. ఫీచర్ ఫిల్మ్ కు ఉన్న డెఫినేషన్లో మొదటి పదం ఏమిటంటే, దానికి క్లైమాక్స్ ఉండాలనేది. క్లైమాక్స్ ఉంటేనే అది ఫీచర్ ఫిల్మ్ అవుతుంది.

Image result for bahubali 2

అయితే బాహుబలికి పార్ట్ వన్లో ఎలాంటి క్లైమాక్స్ లేదు. అయినా దాన్ని జాతీయ ఉత్తమ చిత్రంగా ప్రకటించారప్పట్లో. అనేక మంది సినిమా క్రిటిక్స్ తీవ్రంగా విమర్శించారు. కావాలంటే బాహుబలి పార్ట్ టూ వచ్చాకా మొత్తంగా దీన్ని ఉత్తమ చిత్రంగా ప్రకటించుకోవాలి కానీ, క్లైమాక్స్ లేని సినిమాకు ఎలా ఉత్తమ చిత్రం అవార్డును ఇస్తారు? అంటూ అనేక మంది ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు లేవు. జాతీయ అవార్డుల ఎంపిక కమిటీ డొల్లతనం అది.

మరింత సమాచారం తెలుసుకోండి: