టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై అలుపెరగని పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి.. తాజాగా మరో లీక్ ఇచ్చారు. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురి బండారాలను బయటపెడుతూ వచ్చింది శ్రీరెడ్డి. దీంతో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మా కూడా దిగొచ్చింది. ఈ నేపథ్యంలో మరో లీక్ ఇచ్చి సెన్సేషన్ అయింది శ్రీరెడ్డి.

Image result for sri reddy

          టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కు స్వస్తి చెప్పాలని శ్రీరెడ్డి డిమాండ్ చేస్తోంది. కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తునే పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆమె టాప్ లెస్ గా నిలబడి టాలీవుడ్ తెరవెనుక బాగోతాలను అర్ధనగ్నంగా విప్పిచెప్పింది. శ్రీరెడ్డి వ్యవహారంపై మొదట ఆగ్రహం వ్యక్తం చేసి బ్యాన్ విధించిన మా.. ఆ తర్వాత దిగొచ్చి బ్యాన్ ఎత్తేసింది. అంతేకాక.. టాలీవుడ్ లో లైంగిక వేధింపుల నివారణకు ప్రత్యేక యంత్రాంగం – క్యాష్ ను ఏర్పాటు చేసింది. ఇది శ్రీరెడ్డి సాధించిన విజయం.

Image result for sri reddy

          ఇంతటితో సంతృప్తి చెందని శ్రీరెడ్డి.. పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా.. రామానాయుడు స్టూడియోను టార్గెట్ చేసింది. ఆ స్టూడియోలో ఎంతోమంది అమ్మాయిల జీవితాలు బలైపోయాయని తెలిపింది. రామానాయుడు స్టూడియోలో నలిగిపోయిన వందలమంది అమ్మాయిలకు న్యాయం జరగాలని శ్రీరెడ్డి డిమాండ్ చేసింది. అభిరామ్ లాంటి వాళ్లను నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయాలని కోరింది. ఇకపై ఏ అమ్మాయి జీవితంతోనైనా ఆడుకోవాలనుకుంటే భయపడేలా శిక్షించాలని చెప్పింది.


          రామానాయుడు మనవడు, సురేష్ తనయుడు అభిరామ్.. తనను ప్రేమ పేరుతో వాడుకుని వదిలేశాడని శ్రీరెడ్డి ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా బయటపెట్టింది. దీంతో టాలీవుడ్ పెద్దలపై పలు విమర్శలు వస్తున్నాయి. అయితే మా మాత్రం వాటితో తమకు సంబంధం లేదని తేల్చేసింది. దీంతో శ్రీరెడ్డి తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. మరి చూద్దాం.. మున్ముంది ఎలాంటి లీక్స్ ఇస్తుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి: