బాలీవుడ్ కామెడీ నటుడు రాంపాల్ యాదవ్  ఆయన భార్య రాధను ఢిల్లీలోని 'కర్ కర్ డూమా' కోర్టు దోషిగా నిర్ధారించింది.  ‘భూల్‌ భులయ్యా’, ‘పార్టనర్’, ‘హంగమా’  లాంటి ఎన్నో చిత్రాల్లో రాంపాల్ తన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు.  కొన్ని టివి షోల్లో కూడా తన కామెడీ తో నవ్వించిన ఈ హాస్య నటుడిపై కేసు నమోదు కావడం చర్చనీయాంశం అయ్యింది. 
Image result for bollywood actor rajpal yadav
బాలీవుడ్ లోనే కాకుండా ‘కిక్2’ చిత్రంలో కూడా నటించాడు రాంపాల్ యాదవ్. రాజ్ పాల్ యాదవ్, అతని భార్య రాధ 2010లో ఒక హిందీ సినిమా నిర్మాణం కోసం ఢిల్లీకి చెందిన వ్యాపారి ఎం.జి.అగర్వాల్ వద్ద 5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. బాకీ తీర్చకపోవడంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.  ఈ బాకీ ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో అది కాస్త 8 కోట్ల రూపాయలకు చేరిందని సమాచారం.   
Related image
తన బాకీ ప్రస్తావన తెచ్చినపుడల్లా రాంపాల్ యాదవ్ ఏదో కుంటిసాకులు చెబుతూ వస్తున్నాడని..తనకు న్యాయం చేయాల్సిందిగా బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.  గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన కేసులో రాజ్ పాల్, రాధలకు న్యాయస్థానం ఆరురోజుల జైలు శిక్ష విధించడమే కాకుండా, ముంబైలోని మలాడ్ లోని యాక్సిస్ బ్యాంక్ జాయింట్ అకౌంట్ ఖాతాతో పాటు, కంపెనీ అకౌంట్ ను స్తంభింపజేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: