రెండు రోజలు క్రితం పాకిస్థాన్ సింగర్ తన మాట వినలేదని ఓ దుర్మార్గుడు నిర్థాక్షిణ్యంగా కాల్చి చంపాడు. అప్పటికి ఆమె ఆరు నెలల గర్భిణి అని ఆమె భర్త చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు. పాకిస్థాన్ లోనే కాదు వివిధ దేశాల్లో కొంత మంది సింగర్లపై హత్యలు, హత్యాయత్నాలు జరిగాయి. తాజాగా బాలీవుడ్ సింగ్ పై హత్యాయత్నం జరగడం సెన్సేషన్ క్రియేట్ చేసింది.

‘గాల్ నహీన్ కదానే’ పాటతో పాప్యులర్ అయిన పంజాబీ సింగర్ పర్మిష్‌ వర్మపై హత్యాయత్నం జరిగింది.  గుర్తు తెలియని కొంత మంది దుండగులు పర్మిష్‌ వర్మపై కాల్పులు జరపడం పంజాబ్ లో కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిన్న రాత్రి మొహాలిలో ఒక పార్టీకి హాజరయ్యారు పర్మిష్ వర్మ. పార్టీ ముగిసిన అనంతరం ఇంటికి వెళ్తుండగా.. సెక్టర్‌ 91 సమీపంలోకి వచ్చేసరికి ఆయనపై కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పర్మిష్ మోకాలిలోకి ఒక తూటా దూసుకెళ్లింది. 

తుపాకీ కాల్పులు విని స్థానికులు కేకలు వేసుకుంటూ అక్కడికి రావడంతో దుండగులు పారిపోయారు..లేదంటే అతను చనిపోయేవాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే స్థానికులు ఆయనను మొహాలీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అతని ఫ్రెండ్ కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం పర్మిష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: