టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై గత కొంత కాలంగా శ్రీరెడ్డి చేస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.  వివిధ ఛానల్స్ లో తెలుగు ఇండస్ట్రీలో ఆడవారికి జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు..అత్యాచారాలపై ధైర్యంగా ముందడుగు వేసింది శ్రీరెడ్డి. మొదట్లో ఆమెపై రక రకాల విమర్శలు వచ్చినా..అవన్నీ తట్టుకొని తన లక్ష్యం దిశగా సాగింది.  అంతే కాదు తనకు ‘మా’ అసోసియేషన్ వారు కార్డు ఇవ్వలేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేయడంతో అది కాస్త నేషనల్ న్యూస్ అయ్యింది. దీంతో దెబ్బకు ‘మా’ అసోసియేషన్ దిగివచ్చి ఆమెకు అన్ని విధాలుగా తమ సహకారం అందిస్తామన్నారు. కొన్ని రోజులుగా ఈ విషయంపో వివిధ ఛానల్స్ లో డిబెట్ నిర్వహిస్తున్నారు. 

తాజాగా కత్తి మహేష్‌పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ టీవీ షో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కత్తి మహేష్‌ పక్కనుండగానే.. ఆయన తనను వాళ్లింటికి రమ్మని పిలిచాడని, గదిలోకి పిలిచి తనను బలవంతం చేయశాడని, అడ్డకోబోతే తనను కొట్టి బలాత్కారం చేశాడని వెల్లడించింది. ‘‘కత్తి మహేష్ సంవత్సరం క్రితమే నాకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆయన అంతకు ముందు హైటెక్ సిటీలో ఓ ప్రోగ్రాం చేసేవారు. 
Image result for katti mahesh big boss
ఆ సమయంలో అతన్ని కలిశానని ఆ తర్వాత కత్తి మహేష్ ‘బిగ్ బాస్ ’ లో చాన్స్ రావడంతో కాస్త పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఎలిమినేషన్ అయ్యాక.. నేను మీ బిగ్‌బాస్ చూశాను సార్. చాలా బాగుంది అని కాల్ చేసి చెప్పాను.  బిగ్ బాస్ పూర్తయిన తర్వాత ఫోన్‌లో మాట్లాడినపుడు మీ వైఫ్‌తో లక్నోకి వెళ్తాను అన్నారు కదా.. ఎందుకు హైదరాబాద్‌కి వచ్చారు అని అడిగాను. ‘నాపై ఎక్కువ కాంట్రవర్సీలు వచ్చాయి కదా బిగ్‌బాస్‌లో అందుకే వెనక్కి వచ్చాను అన్నారు. కలుస్తావా నన్ను..’ అని అడిగారు. తాను ఇంటికి వెళ్లిన తర్వాత వెళ్లాక కమిట్‌మెంట్ ఇస్తావా? అని అడిగాడు.

నేను ముందే చెప్పాను ఎవరికి పడితే వారికి కమిట్‌మెంట్ ఇవ్వనని.. దానికి నేను అంగీకరించను. అప్పుడు నన్ను డోర్ వేసి.. కొట్టి.. బలవంతం చేశాడు. తర్వాత బస్ టికెట్‌కి రూ.500 ఇచ్చి పంపించాడు. కత్తి మహేష్‌పై అన్ని ప్రూఫ్‌లు చూపిస్తా’’ అని సునీత పేర్కొంది.


ఈ విషంయపై స్పందించిన కత్తి మహేష్..సునిత తనకు పరిచయమే అని..సునీత తన వద్ద డబ్బుల్లేవంటే నేను అప్పుడప్పుడు డబ్బు సాయం చేసేవాడిని. ఆమె ఒకసారి ఇంటికి వస్తే బయటే మాట్లాడి పంపించాను.  ఆ తర్వాత కూడా తన వద్దకు వస్తే డబ్బులు ఇచ్చి పంపానని..కానీ నాపై సునీత అటెమ్ట్ టు రేప్ అంటూ ఆరోపణలు చేస్తోంది. బిగ్‌బాస్ తర్వాత నాకేదో ఫేమ్ వచ్చిందని నేను ఫీలవుతున్నట్టు.. అమ్మాయిలను మోసం చేస్తున్నట్టు’’ ఆమె ఆరోపిస్తోంది కత్తి మహేష్ తెలిపారు. 

https://www.youtube.com/watch?v=dGnqm1wppmE

మరింత సమాచారం తెలుసుకోండి: