ఆపదలో ఉన్నవారి సహాయార్ధం కోసం చూస్తున్న ఆపన్నులను ఆదుకుంటు పెద్ద చారిటిగా ఎదుగుతున్న సంస్థ మనం సైతం. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది ఔత్సాహిక కళాకారులకు, టెక్నీషియన్స్ కి, ఇతర జూనియర్ ఆర్టిస్టులకు ‘మనం సైతం’ సహాయం అందించింది. మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ ఒక నటుడు..నిర్మాత, దర్శకులు..అయినా కూడా సమాజసేవ చేయాలనే ధృడ సంకల్పంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 
Image result for మనం సైతం
కష్టం వచ్చిందని వెళితే..ఐన వాళ్లు కూడా ఆదుకోలేని పరిస్థితి ఉన్న ఈ కాలంలో ఎలాంటి సంబంధాలు లేకున్నా..ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్న గొప్ప స్వచ్ఛంద సంస్థ ‘మనం సైతం’.  ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను మెచ్చకుంటో పలువురు సెలబ్రెటీలు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. గతంలో   సంస్థ సేవా కార్యక్రమాల గురించి తెలిసి....మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ ను ఇంటికి ఆహ్వానించి 2 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన చిరంజీవి...తాజాగా తన స్వదస్తూరితో ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

మనం సైతం కార్యక్రమాలను మెగాస్టార్ కు వివరించేందుకు సభ్యులు కాదంబరి కిరణ్, బందరు బాబీ ఆయన ఇంటికి వెళ్లారు. తమ్ముడు కాదంబరి మంచి కార్యక్రమం చేస్తున్నాడంటూ ఆ లేఖలో చిరు అభినందించారు. ఇటీవల తాము చేసిన సేవా కార్యక్రమాల గురించి కాదంబరి కిరణ్ చిరంజీవికి చెప్పారు.  కాదంబరి కిరణ్ చేస్తున్న సేవలకు మెగాస్టార్ చిరంజీవి ఎంతో మెచ్చుకున్నారు...ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తమ్ముడు కాదంబరి కిరణ్ వయసులో చిన్నవాడైనా, మనసులో ఎంతో పెద్దవాడు.
Image result for మనం సైతం చిరంజీవి
ఆపదలో ఉన్నవారిని, అవసరార్థులను అక్కున చేర్చుకుని, నేనుసైతం అంటూ వారికి చేయూత అందివ్వడం, వారికి భరోసాగా ఉండటం, వారికి ఆశాజ్యోతిలా ఉండటం ఎంతో అభినందనీయం.  ఈ సంస్థ సేవలు ముందు ముందు ఎంతో మందికి ఉపయోగపడాలని..సంస్థకు మరింత మంచిపేరు రావాలని కోరుకుంటున్నానని అన్నారు చిరంజీవి. 


మరింత సమాచారం తెలుసుకోండి: