Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Apr 21, 2018 | Last Updated 5:11 pm IST

Menu &Sections

Search

‘మహానటి’ టీజర్ మహాఅద్భుతం..!

‘మహానటి’ టీజర్ మహాఅద్భుతం..!
‘మహానటి’ టీజర్ మహాఅద్భుతం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నటి సావిత్రి బయోపిక్ 'మహానటి'.  టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం మ‌హాన‌టి. వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమా సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మహానటి యూనిట్ విడుదల చేసింది. సావిత్ర జీవితంలోని ఏ అంశాలను టీజర్‌లో చూపించారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్‌లో కీర్తి సురేష్, సుమంత, విజయ్ దేవరకొండ పాత్రలు చూస్తే మూవీపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 
mahanati-movie-savithri-keerthy-suresh-samantha-vi
పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్ర బృందం నేడు ‘మహానటి’ టీజర్ రిలీజ్ చేశారు..'అనగనగా ఒక మహానటి' అంటూ ప్రారంభమవుతోన్న టీజర్‌ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే సమంత, విజయ్ దేవరకొండల ఫస్ట్ లుక్స్ మరియు మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పీరియాడిక్ బయోపిక్ గా తెరకెక్కుతున్న "మహానటి" సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అద్భుత చిత్రం. ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 
mahanati-movie-savithri-keerthy-suresh-samantha-vi
కీర్తి సురేష్ లెజండరీ కథానాయకి, మహానటి సావిత్ర పాత్రలో ఒదిగిపోయారు. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇప్పటికే  "మహానటి" మోషన్ పోస్టర్ తోపాటు సినిమాలో కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయనున్నారు.