మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. రచయిత స్థాయి నుండి ప్రముఖ దర్శకుడు స్థాయికి ఎదిగిన త్రివిక్రమ్ వ్రాసే కథలలో పెద్దగా వెరైటీ కనిపించదు. అయితే తన మాటలమాయతో ఇప్పటి వరకు ప్రముఖ దర్శకుడుగా నెట్టుకు వచ్చిన త్రివిక్రమ్ క్రేజ్ కు ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ గ్రహణంగా మారింది.
TRIVIKRAM SRINIVAS LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈసినిమా ఫెయిల్యూర్ తో త్రివిక్రమ్ సమర్థత పై పడ్డ సెటైర్లు ఈమాటల మాంత్రికుడుని నిరాశలోకి తీసుకువెళ్లిపోయినట్లు వార్తలు కూడ వచ్చాయి. ఈషాక్ నుండి తేరుకుని ఎట్టకేలకు జూనియర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ మూవీ మొదలైంది. ఈమూవీకి సంబంధించిన ఒక ఫైట్ సీక్వెన్స్ ను త్రివిక్రమ్ మొదటి షాట్ గా తీసాడని తెలుస్తోంది. 
సంబంధిత చిత్రం
ఈసినిమా కోసం ప్రత్యేకమైన లుక్ ను ఏర్పరుచుకోవడానికి జూనియర్ తన బరువును 20 కేజీలు తగ్గాడు అంటే ఈమూవీ లుక్ కోసం జూనియర్ తన బాడీలో ఎన్ని మార్పులు చేసుకున్నాడో అర్ధం అవుతుంది. ఇది ఇలా ఉండగా ఈమూవీకి కూడ త్రివిక్రమ్ ఒక రొటీన్ కథను వ్రాసాడు అని వ్రాస్తున్న వార్తలు చాలామందికి షాక్ ఇస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా ప్రారంభం అంతా అర్బన్ బేస్డ్ లవ్ స్టోరీగా ఉంటుందని టాక్. అలాంటి పరిస్థుతులలో హీరోకి ఉన్న యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ గ్రౌండ్ బయటపడుతుందని అంటున్నారు. 
TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దానితో ఈమూవీ లవ్ స్టోరీ నుంచి యాక్షన్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. అయితే మళ్లీ ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చాక క్లయిమాక్స్ దిశగా ఈమూవీ కథ నడుస్తుందని సమాచారం. దీనితో బయటకు వస్తున్న ఈమూవీ స్టోరీ లీకులను విన్నవారు త్రివిక్రమ్ మళ్ళీ ఒకనాటి రజినీకాంత్ ‘భాషా’ స్టోరీని తనదైన స్టైల్ లో మార్చి తిరిగి జూనియర్ పై ప్రయోగిస్తున్నాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: