కలక్షన్స్ సునామీతో దూసుకుపోతున్న ‘రంగస్థలం’ ఓవర్సీస్ లో మహేష్ ‘శ్రీమంతుడు’ కలక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి 3.5 మిలియన్ డాలర్ల కలక్షన్స్ కు అతి చేరువలో ఉంది. దీనితో ఈవారం విడుదల కాబోతున్న మహేష్ ‘భరత్ అనే నేను’ మూవీ తన టాక్ తో సంబంధం లేకుండా ముందుగా చరణ్ ఓవర్సీస్ రికార్డులను బ్రేక్ చేసి తాను ఎప్పటికీ ఓవర్సీస్ ప్రిన్స్ అన్న విషయాన్ని రుజువు చేసే విధంగా మహేష్ వ్యూహాలు ఉన్నాయి అన్న వార్తలు వస్తున్నాయి.  
MAHESH BHARATH ANE NENU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికి కారణం చరణ్ క్రియేట్ చేసుకున్న ఓవర్సీస్ రికార్డును కేవలం ఒక్క వారం రోజులలో బ్రేక్ చేసే దిశలో ‘భరత్’ వ్యూహాలు నడుస్తున్నాయి. యుఎస్ లో దాదాపు 400 లొకేషన్లలో ఏకంగా 2 వేల ప్రిమియర్ షోలు ప్లాన్ చేశారు ‘భరత్ అనే నేను’ సినిమాకు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా చాలు ప్రిమియర్లతోనే 1.5-2 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్లో కలక్షన్స్ సునామీ ఖాయం అని అంటున్నారు.
సంబంధిత చిత్రం
అమెరికాలో ఈ సినిమాకు మొదటి వారంలో వచ్చే వీకెండ్ లో 10 వేల షోలు ప్లాన్ చేసిన నేపధ్యంలో ఈమూవీ అతి సులువుగా మొదటి వారంలోనే టాక్ తో సంబంధం లేకుండా 3 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి. దీనికితోడు అమెరికాలో గతంలో మహేష్ చిత్రాలు విడుదలైన థియేటర్ల సంఖ్య కన్నా ఎక్కువ థియేటర్లలో  ‘భరత్’ ను విడుదల చేస్తున్న నేపధ్యంలో ఈమూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కేవలం రెండు వారాలలో 5 మిలియన్ల డాలర్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేస్తుంది అని విశ్లేషకుల అంచనా. 
MAHESH BHARATH ANE NENU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇక తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ప్రీమియర్ షోల టిక్కెట్లు అమెరికాలో హాట్ కేక్స్ లా అమ్మకం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించి దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 99 కోట్ల బిజినెస్ జరిగిన నేపధ్యంలో ఈమూవీని కొనుక్కున్న బయ్యర్లు లాభ పడాలి అంటే ఈమూవీకి ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల నెట్ కలక్షన్స్ రావాలి అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇంత భారాన్ని భరిస్తూ ముందుగా చరణ్ ఓవర్సీస్ రికార్డులను చెక్ పెట్టడానికి ‘భరత్’ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు విజయవంతం అవుతాయో మరొక నాలుగు రోజులలో తెలిసిపోతుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: