నటి శ్రీరెడ్డి చేస్తున్నపోరాటంలో అనేకమంది టాలీవుడ్ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్న నేపధ్యంలో ఇండస్ట్రీ వర్గాలలోని ప్రముఖులు అంతా ఏక్షణాన ఎవరి పేరు బయటకువస్తుందో అన్నభయంతో టెన్షన్ పడుతున్నారు. ఇలాంటిపరిస్థుతులలో ఈలిస్టులో దర్శకుడు కొరటాల శివ కూడ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేసాయి. అయితే ఈగాసిప్పులను కొరటాల తన సన్నిహితుల వద్ద ఖండించినట్లు వార్తలు వస్తున్నాయి. 
KORATALA SHIVA MEDIA INTEVIEW PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి సందర్భంలో నిన్న ఒకప్రముఖ తెలుగు దినపత్రికకు కొరటాల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ క్యాస్టింగ్ కౌచ్ ల వ్యవహారం పై వ్యూహాత్మకంగా స్పందించాడు. ఈవిషయం పై తాను ఖచ్చితంగా మాట్లాడుతానని అయితే ప్రస్తుతం తనదృష్టి అంతా ‘భరత్ అనే నేను’ పై ఉండటంతో ఈవిషయాన్ని తాను పక్కకుపెట్టానని అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీనినిబట్టి చూస్తుంటే త్వరలోనే ఈ క్యాస్టింగ్ కోచ్ విషయంలో కొరటాల స్పందన బయటకు వచ్చే ఆస్కారం ఉంది. 
KORATALA SHIVA MEDIA INTEVIEW PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇదే సందర్భంలో తన ‘భరత్’ గురించి మాట్లాడుతూ కొరటాల కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేపధ్యంలో ఈసినిమా కథ నడుస్తుంది అని చెపుతూ ఒకనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ‘భరత్’ ఉంటే ఎలా ఉండేది అన్న ఊహాజనితమైన కథ మాత్రమే ఈమూవీ అని అంటూ అయితే సినిమా చూసే ప్రేక్షకులకు వర్తమాన రాజకీయ నేపధ్య సంఘటనలు గుర్తుకు వచ్చేలా ఈమూవీ కథను తాను వ్రాసాను అంటూ లీకులు ఇచ్చాడు. 
KORATALA SHIVA MEDIA INTEVIEW PHOTOS కోసం చిత్ర ఫలితం
శ్రీశ్రీ కవితలు అంటే తనకు చాల ఇష్టమని చెపుతూ శ్రీశ్రీ కవితలు లా ఆవేసపూరితంగా సినిమాలు తీయాలని తనకు కోరిక ఉన్నా అలాంటి ఆవేసపూరితమైన సినిమాల కథలలో టాప్ హీరోలు నటించడానికి ఒప్పుకోరు కాబట్టి ఒక లవ్ స్టోరీని వర్తమాన రాజకీయాలు  సామాజిక పరిస్తుతులతో కలిపి తీయవలసిన పరిస్థితి తనక్ ఏర్పడుతోంది అంటూ తన పై తానే జోక్ చేసుకున్నాడు కొరటాల. రాజకీయాలు చాల ఆసక్తికరమైన సబ్జెక్ట్ అనీ అందువల్లనే జనం తమకు తెలిసినా తెలియకపోయినా అందరు రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారని అంటూ ఇచ్చిన మాటకు కట్టుబడటం అన్న అంశం చుట్టూ అల్లిన కథ ‘భరత్’ అని చెపుతూ ఈమూవీలో సంచలనాలు ఉండవు కేవలం ఆలోచించే అంశాలు మాత్రమే ఉంటాయి అని చెపుతున్నాడు కొరటాల..  


మరింత సమాచారం తెలుసుకోండి: