నటి శ్రీ రెడ్డికి బాసటగా నిలుస్తూ ఆమె ఉద్యమానికి మద్దతు ఇస్తున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో నిన్న ఒక ప్రముఖ ఛానల్ ఫిలిం ఇండస్ట్రీలో చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ సతమతమవుతున్న ఆర్టిస్టులతో పాటుగా భాగ్యనగరంలోని కొన్ని ప్రముఖ మహిళా సంఘాల నేతలను ఆహ్వానించి నిర్వహించిన ఈ లైవ్ చర్చా గోష్టిలో పాల్గొన్న అనేకమంది నటీమణుల ఆవేశం కట్టలు తెంచుకోవడమే కాకుండా ఉద్వేగంతో కొందరు మాట్లాడుతూ స్పృహ తప్పిన సంఘటనలు కూడ చోటుచేసుకున్నాయి. 
SRI REDDY AT WOMEN ORGANIZATION MEET PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ చర్చా వేదికలో మాట్లాడిన చాలామంది శ్రీ రెడ్డి ఉద్యమానికి బాసటగా నిలుస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈపరిస్తుతుల పై పవన్ బాలకృష్ణలు ఎందుకు స్పందించరు అంటూ ప్రశ్నలు కురిపించారు. మరొక మహిళ అయితే సినిమాలలో తాను నటించే అన్నయ్య పాత్రలో తన చెల్లెలి కోసం ఎన్నో పాత్రలను చేసిన బాలకృష్ణ ఇండస్ట్రీలో చెల్లెళ్ళ లాంటి ఎంతోమంది అనుభవిస్తున్న వ్యధను పట్టించుకోడా అంటూ ఘాటైన విమర్శలు చేసారు.
SRI REDDY AT WOMEN ORGANIZATION MEET PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి మహిళల సమస్యలు తీరుస్తాను అంటూ ప్రసంగాలు చేస్తున్న పవన్ కు శ్రీ రెడ్డి లాంటి ఎంతోమంది మహిళలు అనుభవిస్తున్న బాధలు అర్ధం కావడం లేదా అంటూ కామెంట్స్ చేసారు. ఇదే చర్చా గోష్టిలో పాల్గొన్న మరొక మహిళ రాబోతున్న ఎన్నికలలో పవన్ కు ఓట్లు వేయవద్దు అంటూ పిలుపు ఇవ్వగానే ఆకార్యక్రమానికి వచ్చిన మహిళలు అంతా ఒకేసారి ఉవ్వెత్తున చప్పట్లు కొట్టడం చూసినవారికి పవన్ పై మహిళా సంఘాలు ఎంత అసహనంగా ఉన్నారో అర్ధం అవుతుంది. 
TOLLYWOOD TOP HEROES కోసం చిత్ర ఫలితం
టాలీవుడ్ టాప్ హీరోలు అంతా చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ జీవితం గడుపుతున్న ఆర్టిస్టుల శ్రమతో విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు అంటూ అనేకమంది ఈ చర్చా గోష్టిలో ఉద్వేగంగా కామెంట్స్ చేయడం చూస్తుంటే టాలీవుడ్ టాప్ హీరోల పై మహిళా సంఘాలకు పెరిగిపోయిన అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. జరుగుతున్న ఈ పరిణామాలు అన్నీ టాప్ హీరోలకు ఎటువంటి సమస్యలను సృష్టించలేకపోయినా ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగుతున్న పవన్ బాలయ్యలకు శ్రీ రెడ్డి వ్యవహారం క్యాస్టింగ్ కౌచ్ దోపిడీలకు సంబంధించిన ఆరోపణలు కొంతమేరకు పవన్ బాలకృష్ణలకు నష్టం చేకూరుస్తుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: