2006 లో వచ్చిన పోకిరి సినిమా ఎన్ని సంచలనాలను క్రియేట్ చేసిందో మనకి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక డాన్సర్ కు పేరొచ్చినంతగా ఇంకెవరికీ రాలేదంటే అది అతిశయోక్తి కాదు. ఆమె ఎవరో కాదు ఐటమ్ బాంబ్ ముమైత్ ఖాన్. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. నిజానికి ఈ సినిమాకంటే మూడు సినిమాల్లో చేసినప్పటికీ  ఇంతపేరును సంపాదించలేకపోయింది.


ఇక ఐటమ్ సాంగ్ అంటేనే చాలు ముమైత్ ను ఎంపికచేసేవారు. అయితే ఉన్నట్లుండి 2016 తరువాత ఆమె తెరమీద కనిపించడం మానేసింది. నిజానికి ఆమెకు అవకశాలు తగ్గిపోవడంవల్ల ఆమె ముంబై వెళ్ళిపోయింది అని అందరూ అనుకుంటున్నా సమయంలో అనూహ్యంగా బిగ్ బాస్ షో కి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తాను తెరమీద మళ్ళీ కనిపించడానికి ఎందుకు ఇంత సమయం పట్టిందో గల కారణాలను ఆమె తన ఫేసుబుక్ పేజీలో రాసుకొచ్చింది.


తాను గత  రెండేళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. అధిక బరువులు మోయవద్దని డాక్టర్లు సూచించారని, వారి సూచనల మేరకు తగు  చికిత్సను తీసుకుంటున్నానని చెప్పింది. మూర్ఛవ్యాధిని అరికట్టే లిపివిల్ అనే ఔషధం ద్వారా తాను లావెక్కిన్నట్లు తెలిపింది. తనకు బరువు పెరగడం ఒక సమస్యకాదని, అనుకున్న టైంలో అనుకున్న శరీరాకృతిని సాధించే సత్తా, నమ్మకం తనకు ఉందని చెప్పింది. సమాయానికి భోజనం చేయడం, తగినంత నీరు తీసుకోవడం, ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతాం అని సలహాలు కూడా ఇచ్చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: