తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ఆందోళనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పసిపిల్లలను కూడా రేప్ చేసి చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడపిల్లల భద్రతపై ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఓ హీరోయిన్ .. తనకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయంటూ ఓపెన్ గా చెప్పి.. సంచలనం సృష్టించింది.

Image result for nivetha pethuraj

          నివేదా పేతురాజ్.. ఈ పేరు సౌతిండియాలో సుపరిచితమే.! తెలుగులో మెంటల్ మదిలో.. అనే సినిమాలో హీరోయిన్ గా తళుక్కున మెరిసింది. తమిళ్ లో ఈ అమ్మడి కేరీర్ బాగానే నడుస్తోంది. చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు టాలీవుడ్ లో శ్రీరెడ్డి ఇష్యూ, మరోవైపు దేశంలో కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులు నడుస్తున్న నేపథ్యంలో ఆడపిల్లల భద్రత, లైంగిక వేధింపులు తదితర అంశాలపై నివేదా పేతురాజ్ స్పందించింది. తనకు ఎదురైన అనుభవాలను వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Image result for nivetha pethuraj

          “ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో లైంగిక వేధింపులు ఎదురయ్యే ఉంటాయని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా.. అలాంటి వారిలో నేనూ ఉన్నా.. ఐదేళ్ల వయసులోనే వేధింపులు ఎదుర్కొన్నా.. ఇది తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి? అదేంటో కూడా అప్పట్లో తెలీదు.. బయటివారి కంటే తెలిసినవారే ఇలాంటి పనులకు ఎక్కువగా పాల్పడుతుంటారు. పేరెంట్స్ అందరికీ నా రిక్వస్ట్ ఒక్కటే.. పిల్లలతో ఇలాంటి విషయాలు చర్చించండి.. ఇబ్బందిగా అనిపించినా తప్పులేదు. రెండేళ్ల వయసు నుంచే నేర్పించండి.. చిన్న చిన్న వాటికి పోలీసులను ఆశ్రయించలేం. ముందు మనల్ని మనం నమ్మాలి. ఇప్పటికీ నేను ఒంటరిగా వెళ్లడానికి భయపడుతుంటా.. ఎవర్ని చూసినా మంచోళ్లు కాదేమేననే సందేహం కలుగుతుంది. ఇది తప్పు.. ఈ విషయంలో మగవాళ్ల సహకారం కూడా ఉంటే పిల్లలు, ఆడపిల్లలను వేధింపుల నుంచి కాపాడుకోగలం..” అని నివేదా ఆవేదన వ్యక్తం చేశారు.

Image result for nivetha pethuraj

          టాలీవుడ్ లో శ్రీరెడ్డి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. అయితే శ్రీరెడ్డి సినిమా ఇండస్ట్రీలో అఘాయిత్యాలపై పోరాడుతోంది. అయితే ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బయట కూడా అనేక అఘాయిత్యాలను మనం చూస్తున్నాం.. అలాంటివాటిలో కథువా, ఉన్నావ్ ఘటనలు మనసు కలచివేస్తున్నాయి. ఈ ఘటనలపై ఎందరో స్పందిస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి వీరి పోరాటం ఎంతవరకూ ఫలిస్తుందో.. నివేదా కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: