ఇండస్ట్రీలో హీరోయిన్లుగా వెండితెరపై మెరవాలంటే పడుకుంటేనే అవకాశాలు కల్పిస్తారు, పడుకోకపోతే స్టూడియో గేట్లను కూడా తాకనివ్వరు, ఒక వేళ పడుకున్నా ఛాన్సులు ఇస్తారన్న గ్యారంటీ లేదు అంటూ సంచలన వాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. నిర్మాతల దగ్గరనుండి హీరోల వరకు హీరోయిన్ కమిట్మెంట్ కోసం పాకులాడతారని చెప్పి టాలీవుడ్లోని చీకటి కోణాన్ని బయటపెట్టింది.


ఇక సినీ ప్రముఖులు ఎక్కడికి వెళ్లినా శ్రీ రెడ్డి చేస్తున్న ఉద్యమంపై స్పందించండి అంటూ విలేకరులు ప్రశ్నలు సంధించడం పరిపాటి అయింది. ఇదే ప్రశ్న పవన్ కల్యాణ్ కు ఎదురవగా "ఏదైనా వివాదం ఉంటే, చట్టపరంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి తప్ప  అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం, టీవీ ఛానెళ్లకు వెళ్లి ఫొటోలు, వీడియోలు లీక్‌ చేయడం పద్దతి కాదు" అని చెప్పాడు. దానికి శ్రీ రెడ్డి కూడా "పవన్‌ కల్యాణ్‌ జీ ఆంధ్రప్రదేశ్‌ కోసం మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం కోర్టుకు లేదా పోలీస్‌ స్టేషన్‌కు ఎందుకు వెళ్లలేదు" గట్టి కౌంటర్ వేసింది.


అయితే ఆమె వేసిన కౌంటర్ పై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా రాయలేని పదాలతో బూతులు తిడుతూ అమెపై విరుచుకుపడుతున్నారు. గతంలో ఆమె సోషల్ మీడియా లైవ్ చాట్ లో ఎంత హాట్ గా మాట్లాడుతుందో చూడండి అంటూ ఓ వీడియోను పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: