అల్లుఅర్జున్ ‘చెప్పను బ్రదర్’ కామెంట్స్ తరువాత బన్నీ పవన్ ల అభిమానుల మధ్య చాల గ్యాప్ పెరిగిన విషయం తెలిసిందే. ఈగ్యాప్ వల్ల అల్లుఅర్జున్ సినిమాల పై కావాలని పవన్ అభిమానులు నెగిటివ్ ప్రచారాలు చేసిన సందర్భాలు కూడ ఉన్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఎవరు ఊహించని విధంగా అల్లు కాంపౌండ్ పవన్ వైపు యూటర్న్ తీసుకోబోతోంది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

మొన్న మెగాస్టార్ చిరంజీవిని ‘నాపేరు సూర్య’ సెట్స్ పైకి ఆహ్వానించి చిరంజీవి దీవెనలు పొందిన అల్లుఅర్జున్ తాను ఎప్పటికీ మెగా కాంపౌండ్ హీరోనే అన్న సంకేతాలను చాలవ్యూహాత్మకంగా ఇచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ చరణ్ ల మధ్య విపరీతమైన సాన్నిహిత్యం పెరిగిన నేపధ్యంలో ఏదోవిధంగా పవన్ ను కూడ ఒప్పించి బన్నీ నటిస్తున్న ‘నాపేరు సూర్య’ సెట్స్ వైపు రప్పించడానికి అల్లు అరవింద్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు టాక్. 
సంబంధిత చిత్రం
ఇప్పటికే అల్లు అర్జున్ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను తన మామయ్యా చిరంజీవి ‘జనసేన’ కు సపోర్ట్ ఇస్తే తాను కూడ పవన్ కు సపోర్ట్ ఇస్తాను అని చెప్పి ఎప్పటికైనా తామంతా ఒకటే అన్న సంకేతాలు ఇచ్చాడు. దీనికి కొనసాగింపుగా ఏదోవిధంగా పవన్ తో రాజీపడి పవన్ ఫ్యాన్స్ ను కూడ బుట్టలో వేసుకోవాలని బన్నీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో రెండున్నర వారాల్లో అల్లుఅర్జున్ సినిమా ‘నా పేరు సూర్య’ విడుదల కాబోతున్న నేపధ్యంలో పవన్ తో ఎదో ఒక సందర్భంలో కలయిక ద్వారా పవర్ స్టార్ ఫ్యాన్స్ వ్యతిరేకత నుంచి పర్మినెంట్ గా బయటకు రావచ్చు అన్న బన్నీ ఆలోచన. 
సంబంధిత చిత్రం
‘నాపేరు సూర్య’ సినిమాకు ఆశించిన స్థాయిలో క్రేజ్ ఏర్పడని పరిస్తుతులతో పాటు దశలవారీగా విడుదల చేస్తున్న ఈమూవీ సాంగ్స్ ఏమాత్రం ఆసక్తి రేకెత్తించకపోగా ఈమూవీ స్టిల్స్ కూడా పెద్దగా బన్నీ అభిమానులకే కిక్ ఇవ్వడం లేదు అనివార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ఇక ఆఖరి అస్త్రంగా పవన్ ను కూడా ఉపయోగించుకోవడానికి ఆలోచనలో పడ్డాడు అనుకోవాలి. అయితే బన్నీ ఆలోచనలకు పవన్ ఎంత వరకు సహకరిస్తాడు అన్నది సస్పెన్స్..  


మరింత సమాచారం తెలుసుకోండి: