‘అజ్ఞాతవాసి’ షాక్ నుండి తేరుకుని త్రివిక్రమ్ మొదలుపెట్టిన జూనియర్ త్రివిక్రమ్ ల మూవీ ఎట్టకేలకు పట్టాలు ఎక్కింది. రామోజీ ఫిలిం సిటీలో రెండెకరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈనెల 13 నుంచి మండుతున్న ఎండలను కూడ లెక్కచేయకుండా చాల వేగంగా అత్యంత ఏకాగ్రతతో ఈమూవీ షూటింగ్ ను త్రివిక్రమ్ పరుగులు తీయిస్తున్నట్లు టాక్. రాయలసీమ గ్రామీణ వాతావరణాన్ని ప్రతి బింబించేలా ఏర్పాటు చేసిన సెట్ లో ఇప్పుడు ఈషూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 
సంబంధిత చిత్రం
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో జూనియర్ సీమ ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఈన్యూస్ బయటకు రావడంతో జూనియర్ అభిమానులు షాక్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కూడ పవన్ ను ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చూపెట్టి ఎవరికీ అర్ధంకాని హాస్యం సీన్స్ క్రియేట్ చేసి పవన్ అభిమానులకే నచ్చని సినిమాగా ‘అజ్ఞాతవాసి’ ని మార్చాడు త్రివిక్రమ్. 
TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఇంత ఘోరమైన అవమానం జరిగినా త్రివిక్రమ్ కు ఇంకా ఆసాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్ర పై మోజు పోలేదా అంటూ జూనియర్ అభిమానులు భయపడుతున్నట్లు టాక్. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మాస్ కి నచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాల దండిగా జూనియర్ మూవీలో ఉంటాయి కాబట్టి కథకు రాయలసీమ ప్రాంత నేపధ్యాన్ని త్రివిక్రమ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 
POOJA HEGDE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే ఈమూవీకి హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న నేపధ్యంలో మరో ముఖ్యమైన పాత్రకోసం మరో సీనియర్ హీరోని సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా కోసం జూనియర్ కష్టపడి 25 కేజీలు బరువుతగ్గి చాల స్లిమ్ గా అయిన నేపధ్యంలో ఇప్పుడు ఈమూవీలో ఈ ‘అజ్ఞాతవాసి’ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రయోగాలు ఏమిటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: