ఈ మద్య తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా వరకు  కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని..ఏ అమ్మాయి సినిమా చాన్స్ కోసం వెళ్లినా..కామాంధులు ఉంటున్నారని..వారి పక్కలో పడుకుంటే కాని సినిమా చాన్స్ లు రావడం లేదని ఆరోపిస్తూ వచ్చింది. అంతే కాదు తనకు ‘మా’ అసోసియేషన్ కార్డు ఇవ్వలేదని అర్థనగ్న ప్రదర్శన చేయడంతో మ్యాటర్ చాలా సీరియస్ అయ్యింది. 

అప్పటి నుంచి శ్రీశక్తి ( శ్రీరెడ్డి) కి మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు ఇస్తూ వస్తున్నారు.  ఈ నేపథ్యంలో మా అసోసియేషన్ వారు కూడా శ్రీశక్తికి తమ సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని వెల్లడించారు.  అయితే తాము ఇంత పోరాడుతున్నా..జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ మాత్రం ఏమీ స్పందించడం లేదని..ప్రజల కోసం ప్రశ్నిస్తారన్న వ్యక్తి ఇప్పటి వరకు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు శ్రీశక్తి.  హీరో పవన్ కల్యాణ్ పై మహిళా నటి  శ్రీ శక్తి (శ్రీరెడ్డి) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 'తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’ అంశంపై రెండో రోజూ చర్చా కార్యక్రమం నిర్వహించారు.

హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ..పవన్ కల్యాణ్ ! నువ్వు ప్రజానాయకుడివి అయి ఉండి ఏం మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్ కు వెళ్లమని చెబుతున్నావు? నువ్వు చెప్పాలి నాకు సలహా! ‘పవన్ కల్యాణ్ అన్న’ అన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా. అంతే కాదు పవన్ కళ్యాన్ ని ఏ అమ్మాయి అన్నా అని అనొద్దని..కొన్ని రాయడానికి వీలు లేని బండ బూతులు తిట్టింది.   అంతే కాదు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై శ్రీశక్తి విరుచుకుపడింది.

సినిమాల్లో అవకాశాలు దొరక్క, ఉపాధిలేక, పూటగడవని ఆర్టిస్టులు వ్యభిచారం బాట పడితే, ప్రభుత్వం దానిని కూడా బ్యాన్ చేసిందని, మరి ఆర్టిస్టులు ఎలా బతకాలి అని శ్రీశక్తి ప్రశ్నించింది.పెట్టుబడిదారుడు వాడి ఇష్టం వచ్చినట్టు వాడు సినిమా తీసుకుంటాడు. మీకెందుకు అవకాశాలిస్తారని కొంతమంది నిర్మాతలు మాట్లాడుతున్నారు. ముంబై వాళ్లను ఆర్టిస్టులుగా తీసుకుంటే ముంబైకు, విదేశీ ఆర్టిస్టులను తీసుకుంటే విదేశాలకు వెళ్లి సినిమాలు తీసుకుని, అక్కడే రిలీజ్ చేసుకోండి. మేము ఆర్టిస్టులం.. ఆర్టిస్టులుగానే ఉంటాం..ఇక్కడే చచ్చిపోతాం. మాకు వేరే అవసరం లేదు. కళామతల్లికే మా జీవితం అంకితం అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: