తెలుగు ఇండస్ట్రీలోకి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత నాని నటించిన ‘ఎవడే సుబ్రమాణ్యం’ చిత్రంలో ఫ్రెండ్ గా నటించి మంచి మార్కులే కొట్టాడు.  ఆ తర్వాత ‘పెళ్లిచూపులు’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న విజయ్ తర్వాత సందీప్ వంగ దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ విజయంతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.
Image result for arjun reddy movies
ఇప్పుడు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ అంటే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుసగా ఛాన్స్ లు రావడం మొదలయ్యాయి.  విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'టాక్సీవాలా' రూపొందింది. ఈ సినిమా ద్వారా రాహుల్ సాంకృత్యన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విజయ్ దేవరకొండ టాక్సీ డ్రైవర్ గా నటించిన ఈ సినిమాలో, మాళవిక శర్మ, ప్రియాంక జావల్కర్ కథానాయికలుగా కనిపించనున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నుంచి ఈ నెల 17 సాయంత్రం టీజర్ ను రిలీజ్ చేస్తామన్నట్టుగా చెప్పారు.
Related image
కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల  టీజర్ రిలీజ్ ఒకరోజు వాయిదా పడింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను మే 18వ తేదీన విడుదల చేస్తారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. డిఫరెంట్ కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: