స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా వస్తుందని తెలిసిందే. మే 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. యాంగ్రీ సోల్జర్ గా బన్ని తన లుక్ తో అదుర్స్ అనిపించాడు. ఇక ఈ సినిమా తర్వాత బన్ని ఎవరితో సినిమా చేస్తాడు అన్న విషయం పై ఓ న్యూస్ బయటకు వచ్చింది.


సరైనోడు, డిజే తర్వాత ఇప్పుడు నా పేరు సూర్య సినిమా కూడా బన్నికి హిట్ ఇవ్వడం గ్యారెంటీ అన్నట్టు ఉంది. ఇక ఈ సినిమా తర్వాత క్రేజీ డైరక్టర్ కొరటాల శివతో బన్ని సినిమా ఉంటుందని చెబుతున్నారు. రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ మిర్చి నుండి జనతా గ్యారేజ్ వరకు సూపర్ హిట్లు కొడుతూనే ఉన్నాడు.


ఇక మరో 3 రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ తో భరత్ అనే నేను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కొరటాల శివ. ఓ బాధ్యతగల పౌరుడు సిఎం అయితే ఆ రాష్ట్రం ఎలా ఉంటుందో చూపించేలా ఈ సినిమా ఉండబోతుందట. చూస్తుంటే మళ్లీ కొరటాల శివ హిట్ కొట్టడం గ్యారెంటీ అన్నట్టు కనిపిస్తుంది.


కొరటాల శివ బన్ని ఈ రేర్ కాంబినేషన్ లో సినిమా అంటే మెగా ఫ్యాన్స్ కు పండుగే. అసలైతే బన్ని కోసం లింగు స్వామి ఎదురుచూస్తున్నా ప్రస్తుతం కొరటాల శివతో సినిమానే కరెక్ట్ అని ఆయనకు ఓకే చెప్పాడట. కొరటాల శివ ఇప్పటికే చరణ్, ఎన్.టి.ఆర్ లతో కూడా సినిమా ముహుర్తం పెట్టేశాడు కాని అవి రెండు క్యాన్సిల్ అయ్యాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: