సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. మహేష్ సిఎంగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో సినిమా మీద అంచనాలను ఏర్పరచిన భరత్ అనే నేను ఆఫ్టర్ రిలీజ్ రికార్డులను సృష్టించడం గ్యారెంటీ అంటున్నారు.  


శ్రీమంతుడు తర్వాత మహేష్ తో కొరటాల శివ చేస్తున్న సినిమాగా భరత్ అనే నేను వస్తుంది. మెసేజ్ తో కూడిన కమర్షియల్ సినిమాలను అందించడంలో సత్తా చాటుతున్న కొరటాల శివ భరత్ అనే నేను సినిమాతో కూడా మంచి కథతో వస్తున్నాడని అంటున్నారు. ఇక రీసెంట్ గా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాపై సెన్సార్ వారు కూడా ప్రశంసలు కురిపించారట.


మహేష్ స్టామినాను మరింత పెంచేదిగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అందుకే సినిమా రిలీజ్ కూడా భారీ రేంజ్ లో జరుగుతుంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీగానే రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. 2000 స్క్రీన్స్ లో ప్రీమియర్స్ ఏర్పాటుచేస్తున్నారట. ఈ లెక్క చూస్తుంటే మొదటి రోజే భరత్ రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అనిపిస్తుంది.


బ్రహ్మోత్సవం, స్పైడర్ డిజాస్టర్ల తర్వాత భరత్ అనే నేను మహేష్ అభిమానుల ఆకలి తీరుస్తుందో లేదో చూడాలి. అనుకున్న విధంగా సినిమా ఉంటే కనుక మళ్లీ రికార్డుల సంచలనాలు ఏర్పడినట్టే. వాటికి ప్రతి ఒక్క సిని అభిమాని సాక్ష్యంగా ఉన్నట్టే. ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకోవాలంటే మరో 3 రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: