‘ఒరు ఆదర్‌ లవ్‌’ సినిమాలో టీజర్ లో ఓ కుర్రాడి వంక చూస్తూ కన్నుగీటిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక్క నైట్ లోనే సోషల్ మీడియాలో కోట్ల మంది అభిమానుల గుండెకొల్లగొట్టింది.  ఒక్క సీన్‌తో ఇండియా మొత్తం ఫేమ‌స్ అయ్యింది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. ఆ వీడియోకి యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ వ‌చ్చాయి.   ప్రియా వారియర్....మెన్నటి వరకు ఈ అమ్మాయి గురించి ఎక్కువ మందికి తెలియదు.
Image result for ప్రియా ప్రకాశ్ వారియర్
ఒకేఒక్క వీడియోతో ఈ బ్యూటీని పెద్ద సెలబ్రిటీని చేసేసింది. దేశ వ్యాప్తంగా ఈమె గురించి చర్చించుకునేలా చేసింది. కేవలం తన కళ్లతోనే అద్భుతమైన భావాలు పలికించి యవతను తన మాయలో పడేలా చేసుకుంది. ఇంటర్నెట్లో సంచలనంగా మారిన ప్రియా వారియర్ తాజాగా సన్నీ లియోన్‌ను సైతం వెనక్కి నెట్టేసింది.ఓర చూపుల‌తో కుర్రాళ్ళ గుండెల్లోకి బాణం దించిన ఈ 18 ఏళ్ళ అమ్మాయి త్వ‌ర‌లో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌నే వార్త ఆ మద్య ఫిలిం న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొట్టింది.
Image result for ప్రియా ప్రకాశ్ వారియర్
తాజాగా ఒక ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ తమ కంపెనీ ఉత్పత్తుల కోసం ప్రియా ప్రకాశ్‌ వారియర్‌తో ఒక ప్రకటనను రూపొందించింది. మలయాళం, హిందీ సహా ఆరు భాషల్లో విడుదలవుతున్న ఈ ప్రకటనలో ప్రియ మరోసారి కన్నుగీటి కుర్రకారు మతి పోగొట్టింది.
Image result for ప్రియా ప్రకాశ్ వారియర్
పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే లక్ష మంది ఈ వీడియోను వీక్షించారు.గత వీడియోతో పోల్చితే ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియో తక్కువ వ్యూస్‌నే పొందింది. ‘ఒరు ఆదర్‌ లవ్‌’ సినిమా జూన్‌లో విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: