‘రంగస్థలం’ క్రియేట్ చేస్తున్న రికార్డులకు ఇండస్ట్రీ వర్గాలు షేక్ అవుతుంటే దర్శకుడు బోయపాటి మాత్రం ‘రంగస్థలం’ పేరుచెపితే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాస్ పల్స్ కరెక్ట్ గా తెలిసిన దర్శకుడిగా పేరున్న బోయపాటి రామ్ చరణ్ తో తీస్తున్న సినిమాకు సంబంధించి ‘రంగస్థలం’ భారీ సక్సస్ తరువాత తీవ్ర టెన్షన్ ఎదుర్కుంటున్నట్లు టాక్. ‘రంగస్థలం’ విడుదల ముందువరకు రామ్ చరణ్ మార్కెట్ 100 కోట్లు దాటుతుంది అని ఎవరు ఊహించలేకపోయారు. 
RAMCHARAN LATEST PHOTOS IN RANGASTHALAM MOVIE కోసం చిత్ర ఫలితం
చరణ్ సినిమాలకు ఓవర్సీస్ లో రెండు మిలియన్లు కలక్షన్స్ వస్తే గొప్ప అనుకుంటే ఏకంగా మూడున్నర మిలియన్లకు చేరువలో ‘రంగస్థలం’ దూసుకుపోతుండటంతో బోయపాటి చరణ్ తో తీస్తున్న లేటెస్ట్ మూవీ పై మరింత భాద్యతను పెంచుతోంది. దీనితో ఏవిషయంలోనూ రాజీ పడకుండా ముఖ్యంగా చరణ్ అభిమానులకు ఎటువంటి అసంతృప్తిని ఇవ్వకుండా బోయపాటి తన లేటెస్ట్ సినిమా విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాడు. 
VIVEK OBEROI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
విలన్ గా వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో జీన్స్ హీరో ప్రశాంత్ సీనియర్ హీరొయిన్ స్నేహాతో పాటు ‘భరత్ అనే నేను’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న కైరా అద్వానితో పాటు ఒకప్పటి హీరో ఆర్యన్ రాజేష్ ను కూడ రంగంలోకి తీసుకువస్తు చరణ్ మూవీని భారీతారాగణం మధ్య నిర్మిస్తున్నాడు. ఒకవైపు ఈమూవీని దసరా లోపు ఫినిష్ చేయాలనే టార్గెట్ తో పాటు ‘రంగస్థలం’ సక్సస్ బరువు కూడ బోయపాటి పై పడటంతో ఈమూవీని అందరికీ నచ్చే విధంగా తీర్చిదిద్దడంలో బోయపాటి తెగ టెన్షన్ పడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 
సంబంధిత చిత్రం
ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈమూవీ షూటింగ్ లో త్వరలో చరణ్ జాయిన్ కాబోతున్నాడు. ఈమూవీకి ఎవరు ఊహించని విధంగా ఒక క్లాసికల్ టైటిల్ ను బోయపాటి ఆలోచిస్తున్నట్లు టాక్. ‘రాజ వంశస్థుడు’ అనే టైటిల్ ఈమూవీకి పెడితే ఎలా ఉంటుంది అన్న విషయమై ఇప్పటికే బోయపాటి తన మనసులోని ఆలోచనలను చిరంజీవితో షేర్ చేసాడని వార్తలు వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా చరణ్ స్థాయిని ఏమాత్రం తగ్గించ కుండా బోయపాటి సినిమా ఉండాలి అన్న సూచనలు ఇప్పటికే బోయపాటికి మెగా కాంపౌండ్ నుండి అందాయి అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: