టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం చేస్తున్న శ్రీశక్తి అలియాస్ శ్రీరెడ్డి ఇప్పటి వరకు ఎన్నో కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతూ..వస్తుంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పై నోరు జారడంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు.  పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘పవన్ కల్యాణ్ అన్న’ అన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా అని చెప్పుతో కొట్టుకుంది.
Related image
ఇకపై పవన్ కల్యాణ్ ని ఏ అమ్మాయి కూడా ‘అన్న’ అనొద్దు..’ అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. నువ్వు ప్రజానాయకుడివి అయి ఉండి ఏం మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్ కు వెళ్లమని చెబుతున్నావు? నువ్వు చెప్పాలి నాకు సలహా!.. పవన్ కళ్యాణ్ రాయకూడని లాంగ్వేజ్ లో తిట్టి.. వేలు చూపించి వెళ్ళిపోయింది. వన్ కళ్యాణ్ అభిమానులు.. పవన్ ను ఒక హీరోగా కంటే అంతకు మించిన అభిమానంతో చూస్తారు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు తాము భక్తులమే అని చెబుతారు. అకారణంగా పవన్ కళ్యాణ్ ను శ్రీ రెడ్డి అంతేసి మాటలు అనడం నిజంగా దారుణంగా అనిపిస్తోంది. జూనియర్ ఆర్టిస్ట్ లు సైతం పవన్ కళ్యాన్ ని టార్గెట్ చేసి మాట్లాడటం..ఆ తర్వాత క్షమాపణలు కోరడం చూస్తుంటే..కావాలనే ఎవోరో దగ్గరుండి మరీ అనిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు పవన్ ఫ్యాన్స్.

శ్రీరెడ్డి వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరోలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవన్ వీరాభిమాని హీరో నితిన్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుందని, దానికోసం వేచి చూడాలని అన్నాడు. ప్రతిచర్య వస్తోందని హెచ్చరించాడు. ఈ ట్వీట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద అన్న మాటకు వ్యతిరేకంగానే అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: