ఈ ఫొటోను బాగా గమనించండి.. అమ్మ పక్కన నోట్లో వేలు పెట్టుకొని అమాయకంగా చూస్తున్న ఈ పిల్లోడు ఎవరో గుర్తు పట్టారా..! కాస్త ఆలోచించి చూస్తే ఎవరో గుర్తు పట్టొచ్చు..ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదండీ..యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన తల్లి శాలిని తో ఓ సందర్భంగా తీయించుకున్న ఫోటో. నందమూరి హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్ బాలనటుడిగా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
Related image
బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం నందమూరి తారక రామారావు దర్శకత్వంలో, ఆయన స్వంత నిర్మాణ సంస్థ అయిన ఎన్.ఏ.టి. పిక్చర్స్ పతాకంపై నిర్మించిన 1991 నాటి తెలుగు చలనచిత్రం.  ఈ చిత్రంలో బాలనటుడిగా నటించిన తర్వాత ‘బాలరామాయణం’ లో రాముడిగా నటించాడు.

హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన ఎన్టీఆర్ ‘టెంపర్’ నుంచి ‘జై లవకుశ’ వరకు వరుసగా విజయాలు అందుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నాడు.  ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు ఎన్టీఆర్.  తల్లి శాలిని తో చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: