దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలలో కెల్లా తమిళ ఇండస్ట్రీది ఒక ప్రత్యేకమైన స్థానం. ఏ హీరో అయినా లేక హీరోయిన్ అయినా ఒక్క సారి తమ గుండెలకు చేరువయ్యారంటే వారికి గుడి కట్టించి మరీ ఆరాధిస్తారు అక్కడి ప్రేక్షకులు. నగ్మా, ఖుష్బూ వంటి ఒకప్పటి హీరోయిన్ల పై అభిమానంతో నిర్మించిన గుడిలే ఇందుకు నిదర్శనం.


సాధారణంగా తమిళులు కాస్త బొద్దుగా ఉన్న హీరోయిన్లనే ఇష్టపడతారనే తెలిసిన విషయం తెలిసిందే. అందుకే వాళ్ళు ఇష్టపడే జాబితాలోకి హన్సిక కూడా చేరిపోయింది. అప్పట్లో ఈ అమ్మడుకు చెన్నై పొలిమేరలో గుడి కడతామని ఫ్యాన్స్ వేడుకున్నా అలాంటివి చేయొద్దని సున్నితంగా తిరస్కరించింది. ఇక వారి ఆరాధ్య దైవం బహిరంగంగా బయటికి వస్తే ఊరుకుంటారా? ఇలా కొందరు ఆకతాయిలు చేసిన పనికి ఆమె ఇబ్బంది పడింది.


వివరాల్లోకివెళితే ఇటీవల చెన్నైలోని ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు హన్సిక  హాజరయింది. హన్సిక వస్తుందని తెలియగానే అభిమానులతోఆ ప్రదేశం కిక్కిరిసిపోయింది. మాల్  ప్రారంభించి  తిరిగి వెళ్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు అమెపై అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. కారు ఎక్కే సమయంలో ఎవరో ఆమెను అసభ్యంగా మాట్లాడుతూ, నడుము పై  గిల్లారని, దానివల్లే ఆమె కంటతడి పెడుతూ వెళ్లిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సంఘటన గురించి ఆమె నుండి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: