ఇండస్ట్రీలో హీరోయిన్లుగా వెండితెరపై మెరవాలంటే పడుకుంటేనే అవకాశాలు కల్పిస్తారు, పడుకోకపోతే స్టూడియో గేట్లను కూడా తాకనివ్వరు, ఒక వేళ పడుకున్నా ఛాన్సులు ఇస్తారన్న గ్యారంటీ లేదు అంటూ గత కొంత కాలంగా ఎన్నో సంచలన వాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. నిర్మాతల దగ్గరనుండి హీరోల వరకు హీరోయిన్ కమిట్మెంట్ కోసం పాకులాడతారని చెప్పి టాలీవుడ్లోని చీకటి కోణాన్ని బయటపెట్టింది. అంతే కాదు తనతో కొంత మంది దారుణంగా గడిపారని..చాటింగ్ చేసేవారని ఫేస్ బుక్ లో లీక్ చేసింది. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Image result for శ్రీరెడ్డి పవన్ కళ్యాన్
తమ పోరాటాన్ని పట్టించుకోని ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించింది. పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ, ఆయన తల్లిని ప్రస్తావించిన నటి శ్రీశక్తి అలియాస్ శ్రీరెడ్డిపై మెగా ఫ్యాన్స్ ఇప్పుడు విరుచుకుపడుతున్నారు.  దీంతో ఓ మెట్టు దిగింది శ్రీరెడ్డి..అంతే కాదు తన పిల్లల్ని కూడా బెదిరించారని ఫేస్ బుక్ ఖాతాలో వాపోయిన శ్రీరెడ్డి, పవన్ తల్లిని క్షమాపణ కోరుతున్నానని, తన పిల్లలను ఈ వివాదంలోకి లాగుతున్నందున భావోద్వేగంతో  వేడుకుంది. పవన్ కల్యాణ్ అంటే అసలు లెక్క లేదని వ్యాఖ్యానించింది.


శ్రీరెడ్డి ట్వీట్ కు ఘాటు సమాధానాలు ఇస్తున్న పలువురు ఫ్యాన్స్, రాయడానికి వీల్లేని భాషను సైతం వాడుతున్నారు.గత అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ వీడియోను పోస్టు చేస్తూ, ఓ ప్రజానాయకుడైన పవన్ కల్యాణ్, తమ బాధపై సరిగ్గా రెస్పాండ్ కాలేదని ఆరోపించారు. ఎన్నాళ్లు అమ్మాయిల నోరు నొక్కేస్తారని ప్రశ్నించారు.
Image result for శ్రీరెడ్డి పవన్ కళ్యాన్
తమ మీటింగ్ ను అత్యంత ఘోరంగా అభివర్ణించారని ఆరోపించారు.కేవలం పవన్ కల్యాణ్ కు మాత్రమే తల్లి ఉన్నారా? అని ఆమె ప్రశ్నించారు. కొంతమంది ఎవరి పక్కలో పడుకోకుండానే క్యారెక్టర్లు తెచ్చుకున్నారని, వారిని కూడా ఈ రొచ్చులోకి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ లాగుతున్నారని ఆరోపించారు.ఈ పోరాటంలో తాము సమిధలమైనా లెక్కచేయబోమని హెచ్చరించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: