లోకేష్ మీద టీడీపీ నేతల్లో అసంతృప్తి ఉందా... అంటే అవుననే చెప్పాలి. లోకేష్ తానూ కాబోయే సీఎం అని చాలా అహంకారం చూపిస్తున్నాడని చాలా మంది టీడీపీ నేతలు అసంతృప్తి వెల్ల గక్కుతున్నారు. అయితే ఇంతకు ముందు కూడా లోకేష్ గురించి తన గర్వం గురించి పార్టీ లో తన ఆధిపత్యం గురించి సీనియర్ నేతల్లో కొంచెం అసంతృప్తి ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇంకొంత మంది నేతల్లో రావడం వారు పార్టీ కూడా మారడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఉదంతాలు వస్తున్నాయి. 

Image result for lokesh

ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ నేతల నుంచి ఈ ఆరోపణలు వస్తుండటం విశేషం. లోకేష్ తమను అవమానించేలా వ్యవహరిస్తున్నాడని, లోకేష్ దయాదక్షిణ్యాల మీద తమ జీవితాలు ఆధారపడినట్టుగా ఆయన వ్యవహరిస్తున్నాడని వారు అంటున్నారు. లోకేష్ పై ఇలాంటి ఆరోపణలు వస్తుండటం ఆసక్తిదాయకం. లోకేష్ తీరుతో తాము విసిగి వేసారిపోయామని, తెలుగుదేశం పార్టీని వీడటానికి కూడా అభ్యంతరాలు లేనట్టుగా వారు మాట్లాడుతున్నారు.

Image result for lokesh

ఒకవైపు తెలుగుదేశం పార్టీలోని భజనపరులేమో లోకేష్ ను పొగుడుతూనే ఉన్నారు. ఆయన కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. ఈ మధ్యనే ప్రత్తిపాటి మాట్లాడుతూ.. లోకేష్ ను యంగెస్ట్ సీఎంగా అభివర్ణించాడు. బహుశా త్వరలోనే చంద్రబాబును దించి లోకేష్‌ను చేస్తామన్నట్టుగా ప్రత్తిపాటి మాట్లాడాడు. ఇప్పుడు లోకేష్‌కు అహంభావం తలకెక్కింది అని తెలుగుదేశం నేతలే అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: