మరోరెండు రోజుల్లో విడుదల కాబోతున్న ‘భరత్ అనే నేను’మూవీ రిజల్ట్ పై తీవ్ర ఆసక్తి అన్ని వర్గాలలోను నెలకొని ఉంది. మహేష్ మొదటిసారి సీరియస్ పొలిటికల్ మూవీలో నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీ ట్రైలర్ నుండి ఆడియో దాకా అనేకవిషయాలలో ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇంత పాజిటివ్ టాక్ ఉన్నా ఈమూవీకి కొన్ని అంతర్గత శత్రువులు ఉన్నారు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. 
సంబంధిత చిత్రం
క్లాస్ కు మరియు మాస్ ప్రేక్షకులకు కావలసిన అంశాలు చాల ఈసినిమాలో ఉన్నా ఈకథ ఒక సింపుల్ స్టోరీ అని తెలుస్తోంది. ఇచ్చిన మాటకోసం కట్టుబడే ముఖ్యమంత్రి చుట్టూ అల్లబడిన ఈకథలో సంచలనాలు కంటే అంతర్లీనంగా సందేశాలు ఉంటాయి. మహేష్ బాబు సినిమాలు ఎలాఉన్నా వాటికి సంబంధించిన టాక్ మాత్రం బెనిఫిట్ షో కాగానే విపరీతంగా వైరల్ అయిపోతుంది. దీనికితోడు సోషల్ మీడియాలో మహేష్ యాంటీ ఫాన్స్ మహేష్ సినిమాలపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం ఒక అలవాటుగా గతకొంతకాలంగా కొనసాగుతోంది. పైకి చెప్పకపోయినా ‘భరత్’ మీద ‘రంగస్థలం’ రికార్డుల ఒత్తిడి చాలఎక్కువగా ఉంది. 
BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి పరిస్థుతులలో మహేష్ అభిమానులు ఏవో అద్భుతాలు ఊహించకుండా ఒకమంచి సినిమాకు వచ్చాము అన్న ఫీలింగ్ తో ‘భరత్’ ను చూసినప్పుడు మాత్రమే అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని లేకుంటే ఈమూవీకి మొదటి శత్రువులుగా మహేష్ అభిమానులే మారే పరిస్థితి ఉంది అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. ఈసినిమాకు ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి టెన్షన్ లేకపోయినా ఎదోఒక చిన్న అసంతృప్తి ని ట్రాలింగ్ రూపంలో సోషల్ మీడియాలో హడావిడి చేస్తే దానిని తట్టుకోగల శక్తి ‘భరత్’ కు ఉంటే ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. కొరటాల శివ కథలు అసాధారణంగా ఉండవు. కాని హీరోయిజమ్ ను ఎలివేట్ చేస్తూ ఒక సింపుల్ మెసేజ్ ని కొరటాల చెపుతాడు. 
BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అందువల్ల ఒక అద్భుతమైన కథను ఊహించుకోకుండా ‘రంగస్థలం’ మూవీతో పోల్చకుండా ‘భరత్’ ను భరత్ గా చూస్తే ఈమూవీ హిట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థుతుల పై కొన్ని రాజకీయ పార్టీల పై సెటైర్లు ఉంటాయని చాలామంది ఊహించుకుంటున్నారు. అయితే అటువంటివి ఏమీ ఉండవు అంటూ కొరటాల ఇప్పటికే చాల సార్లు లీకులు ఇవ్వడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఒకమంచి మెసేజ్ తో కూడిన సినిమా ఇది అని అంటున్నాడు. దీనితో ఇప్పటికే అత్యంత భారీ అంచనాలను పెంచుకున్న ‘భరత్’ అంతర్గత శత్రువులను ఎదుర్కుని బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ఎంతవరకు తెచ్చుకుంటుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: