ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే నిర్మాత కు చాలా టెన్షన్ ఉంటుంది. అది కూడా భారీ బడ్జెట్ లాంటి సినిమా అయితే ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే నిర్మాత దానయ్య మాత్రం చాలా నింపాది గా హుషారు గా కనిపిస్తున్నారు. అయితే ఈ హుషార్ కు కారణం ఏమిటనని గమనిస్తే, కొరటాల సినిమా ల్లో తన మార్క్ డైలాగ్స్ అదే స్క్రీన్ ప్లే అన్ని సినిమాల్లో చూసాము. సో అవన్నీ బ్లాక్ బస్టర్స్ ఇప్పుడు కూడా అదే సోషల్ మెసేజ్ లాంటి సినిమాలు, ఎటువంటి ప్రయోగాలు చేయని కొరటాలా ఇది కూడా పక్క హిట్ అని దానయ్య ఫిక్స్ అయిపోయాడు. 

Image result for bharath anu nenu

ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ కు వచ్చింది లగాయతు, వెళ్లేవరకు మాంచి హుషారుగా కనిపించారు. కాస్త పరిచయం వున్న ప్రతి మీడియా వ్యక్తి తోటీ, హుషారుగా మాట్లాడుతూ గడిపేసారు. అదే విధంగా పదే పది నిమషాలు ప్రెస్ మీట్ కానిచ్చేసి, మళ్లీ మీడియా జనాలతో పిచ్చాపాటీ గడుపుతూ కనిపించారు.

Related image

టెన్షన్ లేదా? బర్డెన్ ఏం లేదా? అని ఎవరు అడిగినా హుషారుగా ఎందుకు? అంటూ ఎదురు ప్రశ్నించారు. సూపర్ హిట్ సినిమా చూడబోతున్నారు అంటూ జనాల్ని ఊరించారు. అదే సమయంలో సినిమాను పది కోట్ల లాభానికి కొరటాలకు ఇచ్చేసారటగా? నైజాం ఏరియాను కొరటాల-మహేష్ తీసుకున్నారటగా అని అడిగితే, అన్నీ వట్టి మాటలే, సినిమా తనదే అని, తానే అన్ని ఏరియాలు అమ్మానని, నైజాం తన దగ్గరే వుందని క్లారిటీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: